Title (Indic)ఆపె మెచ్చవలె నీవు అట్టే మెచ్చఁగవలె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె మెచ్చవలె నీవు అట్టే మెచ్చఁగవలె వోపిక గలిగి యిట్టే వుండవయ్య యిపుడు (॥ఆపె॥) అంగన నీతోఁ జెప్పఁగ నట్టే నీవు మాటలాడే- వెంగిలిమాఁటల మాఁటలేల మాకు పొంగుచు నేనే మీఁదువోనిమాఁట లాడించేను వుంగిటి గొనక యిట్టే వుండవయ్య ఇపుడు (॥ఆపె॥) అప్పుడే నిన్నింతి నవ్వుమనఁగా నవ్వే- వప్పణనవ్వులు నవ్వు టవేల మాకు ముప్పిరి నేనే నిన్ను మెసులుగా నవ్వించే వొప్పుగాని నావొద్ద నుండవయ్య యిపుడు (॥ఆపె॥) రవ్వగా నింతి చెప్పఁగా రతి నన్నుఁ గూడితివి యెవ్వరిపంగెనకూటాలేల మాకు మవ్వపుశ్రీవేంకటేశ మరి నే నిన్నుఁ గూడితి వువ్విళ్లూరుచు నిట్టే వుండవయ్య ఇపుడు English(||pallavi||) ābĕ mĕchchavalĕ nīvu aṭṭe mĕchcham̐gavalĕ vobiga galigi yiṭṭe vuṁḍavayya yibuḍu (||ābĕ||) aṁgana nīdom̐ jĕppam̐ga naṭṭe nīvu māḍalāḍe- vĕṁgilimām̐ṭala mām̐ṭalela māgu pŏṁgusu nene mīm̐duvonimām̐ṭa lāḍiṁchenu vuṁgiḍi gŏnaga yiṭṭe vuṁḍavayya ibuḍu (||ābĕ||) appuḍe ninniṁti navvumanam̐gā navve- vappaṇanavvulu navvu ṭavela māgu muppiri nene ninnu mĕsulugā navviṁche vŏppugāni nāvŏdda nuṁḍavayya yibuḍu (||ābĕ||) ravvagā niṁti sĕppam̐gā radi nannum̐ gūḍidivi yĕvvaribaṁgĕnagūḍālela māgu mavvabuśhrīveṁkaḍeśha mari ne ninnum̐ gūḍidi vuvviḽlūrusu niṭṭe vuṁḍavayya ibuḍu