Title (Indic)ఏపులును రాఁపులును యెందాఁకనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏపులును రాఁపులును యెందాఁకనే చాపకింది వెల్లువాయఁ జాలదా సరసము (॥ఏప॥) యెడమాట లాడేది యెందాఁకనే అడియాసలఁ బెట్టే దదెందాఁకనే కడకుఁ దొలఁగరాదు గక్కనఁ బైకొనరాదు జడిసీ జిత్తము నాతో చాలదా సరసము (॥ఏప॥) యెలయింపుఁ గొసరులు యెందాఁకనే అలిగి కోపము నాతో అదెందాఁకనే వలపు చల్లగరాదు వడి మూటఁగట్టగరాదు చలములు పతి నాతో చాలదా సరసము (॥ఏప॥) యేడలేని వినయాలు యెందాఁకనే ఆడుకోలు నిజబాస లవెందాఁకనే కూడెను శ్రీవేంకటాద్రి గోవిందుఁ డిదె నన్ను జాడలెల్లాఁ గంటి మిఁకఁ జాలదా సరసము English(||pallavi||) ebulunu rām̐pulunu yĕṁdām̐kane sābagiṁdi vĕlluvāyam̐ jāladā sarasamu (||eba||) yĕḍamāḍa lāḍedi yĕṁdām̐kane aḍiyāsalam̐ bĕṭṭe dadĕṁdām̐kane kaḍagum̐ dŏlam̐garādu gakkanam̐ baigŏnarādu jaḍisī jittamu nādo sāladā sarasamu (||eba||) yĕlayiṁpum̐ gŏsarulu yĕṁdām̐kane aligi kobamu nādo adĕṁdām̐kane valabu sallagarādu vaḍi mūḍam̐gaṭṭagarādu salamulu padi nādo sāladā sarasamu (||eba||) yeḍaleni vinayālu yĕṁdām̐kane āḍugolu nijabāsa lavĕṁdām̐kane kūḍĕnu śhrīveṁkaḍādri goviṁdum̐ ḍidĕ nannu jāḍalĕllām̐ gaṁṭi mim̐kam̐ jāladā sarasamu