Title (Indic)వాకిటికి వచ్చిఁనాడు వనిత నీ రమణుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాకిటికి వచ్చిఁనాడు వనిత నీ రమణుఁడు కైకొని యలుకలేల కడుఁ దడవేల (॥వాకి॥) కప్పురవిడియ మిదె గందవొడిబరణిదె దప్పి మోవి యండనేల తలపోఁతేల కుప్పలై నవిరు లవె కోరతట్టుపునుఁగిదె కొప్పు ముడువవిదేల కొమ్మ నీవు నేఁడు (॥వాకి॥) బంగారుసురటి యదె పచ్చికస్తూరి యిదె పోంగెటిచెమట యేల బుసకొట్లేల రంగుమీర నద్ద మదే రచనలసొమ్ము లవే సింగారించ విదియేల చెలియరో నేఁడు (॥వాకి॥) చేరువనే పానుపిదే శ్రీవేంకటేశుఁడు వీఁడె మారుమోము లింకనేల మంకులేల వూరకే యాతఁడు నిన్ను నొడఁబాటు చేసి కూడె బీరమేల కమ్మరాను పిలువవే నేఁడు English(||pallavi||) vāgiḍigi vachchim̐nāḍu vanida nī ramaṇum̐ḍu kaigŏni yalugalela kaḍum̐ daḍavela (||vāgi||) kappuraviḍiya midĕ gaṁdavŏḍibaraṇidĕ dappi movi yaṁḍanela talabom̐tela kuppalai naviru lavĕ koradaṭṭubunum̐gidĕ kŏppu muḍuvavidela kŏmma nīvu nem̐ḍu (||vāgi||) baṁgārusuraḍi yadĕ pachchigastūri yidĕ poṁgĕḍisĕmaḍa yela busagŏṭlela raṁgumīra nadda made rasanalasŏmmu lave siṁgāriṁcha vidiyela sĕliyaro nem̐ḍu (||vāgi||) seruvane pānubide śhrīveṁkaḍeśhum̐ḍu vīm̐ḍĕ mārumomu liṁkanela maṁkulela vūrage yādam̐ḍu ninnu nŏḍam̐bāḍu sesi kūḍĕ bīramela kammarānu piluvave nem̐ḍu