Title (Indic)గోరఁబొయ్యే పనికిఁగా గొడ్డలేఁటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గోరఁబొయ్యే పనికిఁగా గొడ్డలేఁటికి ఆరయ నాతఁడే చెప్పీ నతివకు బుద్దులు (॥॥) చిత్తములోపలిచింత చెక్కుచేతఁ గానవచ్చె అత్తి మాటాడించకురే అంగన నంత- బత్తిగలవారమైతే పతిఁ దోడితెత్త మిట్టె వొత్తి యాకె నేమన్న వొప్పగించీఁ దనువు (॥॥) నిండినమైవిరహము నిట్టూర్పులను మించె- నండనే నవ్వించకురే ఆయాలు రేఁగీ వుండరే చుట్టాలమైతే నొక్కటిసేత మిద్దరి చండిపెట్టి పిలిచితే చలపట్టీ నలుక (॥॥) కూడేటితమకములు కొనచూపులందుఁ దేరె తోడనే యుడుగకువే తొలఁగీ సిగ్గు యీడకే శ్రీ వేంకటేశుఁ డేతెంచి కలసె నేఁడు వాడికతో సతి మీరవలపించె నతని English(||pallavi||) goram̐bŏyye panigim̐gā gŏḍḍalem̐ṭigi āraya nādam̐ḍe sĕppī nadivagu buddulu (||||) sittamulobalisiṁta sĕkkusedam̐ gānavachchĕ atti māḍāḍiṁchagure aṁgana naṁta- battigalavāramaide padim̐ doḍidĕtta miṭṭĕ vŏtti yāgĕ nemanna vŏppagiṁchīm̐ danuvu (||||) niṁḍinamaivirahamu niṭṭūrbulanu miṁchĕ- naṁḍane navviṁchagure āyālu rem̐gī vuṁḍare suṭṭālamaide nŏkkaḍiseda middari saṁḍibĕṭṭi piliside salabaṭṭī naluga (||||) kūḍeḍidamagamulu kŏnasūbulaṁdum̐ derĕ toḍane yuḍugaguve tŏlam̐gī siggu yīḍage śhrī veṁkaḍeśhum̐ ḍedĕṁchi kalasĕ nem̐ḍu vāḍigado sadi mīravalabiṁchĕ nadani