Title (Indic)మాతో నేమి చెప్పేవు మాపు దాఁకా సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాతో నేమి చెప్పేవు మాపు దాఁకా సుద్దులు నీతి విచారించుకొంటే నీవెఱఁగవా (॥॥) నమ్మిక గావలెనని నవ్వు దెచ్చుకొనెఁగాక కొమ్మమనసులోపలికోప మారెనా సమ్మతించవచ్చునా చల్లజంపు లివిగాక నెమ్మి నీచేసినచేఁత నీ వెఱఁగవా (॥॥) మచ్చిక చూపవలసి మాటలాడె నింతెకాక కచ్చుపెట్టుకున్నయలుకలు దీరెనా మెచ్చఁదగునా యివి మిక్కిలి కాఁకలుగాక నిచ్చలపు నీగుణాలు నీ వెఱఁగవా (॥॥) వలపు రేఁచేనని వంకచూచె నింతెకాక తలపులో నెంజరి వింతటఁ బాసెనా యెలమి శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి నెలకొన్న నీమహిమ నీవెఱగవా English(||pallavi||) mādo nemi sĕppevu mābu dām̐kā suddulu nīdi visāriṁchugŏṁṭe nīvĕṟam̐gavā (||||) nammiga gāvalĕnani navvu dĕchchugŏnĕm̐gāga kŏmmamanasulobaligoba mārĕnā sammadiṁchavachchunā sallajaṁpu livigāga nĕmmi nīsesinasem̐ta nī vĕṟam̐gavā (||||) machchiga sūbavalasi māḍalāḍĕ niṁtĕgāga kachchubĕṭṭugunnayalugalu dīrĕnā mĕchcham̐dagunā yivi mikkili kām̐kalugāga nichchalabu nīguṇālu nī vĕṟam̐gavā (||||) valabu rem̐senani vaṁkasūsĕ niṁtĕgāga talabulo nĕṁjari viṁtaḍam̐ bāsĕnā yĕlami śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi nĕlagŏnna nīmahima nīvĕṟagavā