Title (Indic)ఆతనినేల కొసరే వప్పటి నీవు నీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనినేల కొసరే వప్పటి నీవు నీ- యేతులెల్లాఁ జూచెఁగదె ఇందాఁకాను (॥॥) నిన్నుఁ బేరుకొని పిల్చి నీతోనే మాటలాడి యెన్నికలు సేసెఁగదె ఇందరిలోన విన్నపాలెల్లా విని వీడెము చేతికిచ్చి ఇన్నిటా లాలించెఁగదె ఇందాఁకాను (॥॥) సరసములెల్లా నాడి సంగడినే కూచుండి అరుదుగా మొక్కెఁగదె అండనే వుండి తెరవేసుకొని మోవితేనియలు నీకొసగి ఇరవుగా నవ్వెఁగదె ఇందాఁకాను (॥॥) వొడివట్టి నినుఁ దీసి వొద్దిక జూజాలాడి జడిగొనఁ గూడెఁగదె చవికెలోన చిడుముడి నన్నునేలె శ్రీవేంకటేశుఁడు నేఁడు యెడయఁడుగదె నిన్ను నిందాఁకాను English(||pallavi||) ādaninela kŏsare vappaḍi nīvu nī- yedulĕllām̐ jūsĕm̐gadĕ iṁdām̐kānu (||||) ninnum̐ berugŏni pilsi nīdone māḍalāḍi yĕnnigalu sesĕm̐gadĕ iṁdarilona vinnabālĕllā vini vīḍĕmu sedigichchi inniḍā lāliṁchĕm̐gadĕ iṁdām̐kānu (||||) sarasamulĕllā nāḍi saṁgaḍine kūsuṁḍi arudugā mŏkkĕm̐gadĕ aṁḍane vuṁḍi tĕravesugŏni movideniyalu nīgŏsagi iravugā navvĕm̐gadĕ iṁdām̐kānu (||||) vŏḍivaṭṭi ninum̐ dīsi vŏddiga jūjālāḍi jaḍigŏnam̐ gūḍĕm̐gadĕ savigĕlona siḍumuḍi nannunelĕ śhrīveṁkaḍeśhum̐ḍu nem̐ḍu yĕḍayam̐ḍugadĕ ninnu niṁdām̐kānu