Title (Indic)అదివో నీ చిత్తము ఆకె భాగ్యము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అదివో నీ చిత్తము ఆకె భాగ్యము కదలిఁక లిందులోనే కనుకో నీవిఁకను (॥॥) పున్నమవెన్నెలలోనఁ బొద్దువోక జవరాలు నిన్నుఁదలఁచి రేయల్లా నిద్దురవోదు విన్నవించితిమి నీకు వేవేలకు నొక్కమాటె యెన్నికలెల్లా నీవే యెఱుఁగుదు విఁకను (॥॥) చేరి యారామములోనఁ జెక్కుచేతితోడఁ జెలి నీరూపు భావించి నివ్వెరగందె యీరీతిఁ గానుక నీకు నిచ్చి వొప్పగించితిమి తారుకాణ లన్నియునుఁ దలఁచుకో యిఁకను (॥॥) కనకపుమేడలోనఁ గామించి యలమేల్మంగ తనివోనినీరతికిఁ దమకించెను యెనసితివి శ్రీ వేంకటేశ యింతలో విచ్చేసి మన సొక్కటాయ నిట్టె మన్నించు మిఁకను English(||pallavi||) adivo nī sittamu āgĕ bhāgyamu kadalim̐ka liṁdulone kanugo nīvim̐kanu (||||) punnamavĕnnĕlalonam̐ bŏdduvoga javarālu ninnum̐dalam̐si reyallā nidduravodu vinnaviṁchidimi nīgu vevelagu nŏkkamāḍĕ yĕnnigalĕllā nīve yĕṟum̐gudu vim̐kanu (||||) seri yārāmamulonam̐ jĕkkusedidoḍam̐ jĕli nīrūbu bhāviṁchi nivvĕragaṁdĕ yīrīdim̐ gānuga nīgu nichchi vŏppagiṁchidimi tārugāṇa lanniyunum̐ dalam̐sugo yim̐kanu (||||) kanagabumeḍalonam̐ gāmiṁchi yalamelmaṁga tanivoninīradigim̐ damagiṁchĕnu yĕnasidivi śhrī veṁkaḍeśha yiṁtalo vichchesi mana sŏkkaḍāya niṭṭĕ manniṁchu mim̐kanu