Title (Indic)ఇద్దరినడుమ నుండీ ఇదివో తాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరినడుమ నుండీ ఇదివో తాను తిద్దుచు జగడములు తేరిచీఁ గాక (॥॥) వొక్కరికి బుద్దిచెప్పీ నొక్కరికి చెక్కు నొక్కి చక్కనినాయకుఁడు సవతులకు అక్కరతో నింత సేసినట్టివాఁడు తానే కాఁడా వుక్కటతో రేఁచుకొని పొడిఁబడిఁగాక (॥॥) వొడివట్టీ నాకెను వొడఁబరచి నీకెను కడుజాణరమణుఁడు కామినులకు ముడికాఁడైనవాఁడు మొదలఁ దానేకాఁడా యెడమాటలాడి బయలీఁదుకొనీఁ గాక (॥॥) కలసీని జవరాలిఁ గాఁగిలించీ కన్నియను లలి శ్రీవేంకటేశుఁడు లలనలకు యెలమి నన్నును నేలె నిన్నిటాఁ దానే కాఁడా వలపులు పెడరేఁచి వసమయ్యీఁగాక English(||pallavi||) iddarinaḍuma nuṁḍī idivo tānu tiddusu jagaḍamulu terisīm̐ gāga (||||) vŏkkarigi buddisĕppī nŏkkarigi sĕkku nŏkki sakkanināyagum̐ḍu savadulagu akkarado niṁta sesinaṭṭivām̐ḍu tāne kām̐ḍā vukkaḍado rem̐sugŏni pŏḍim̐baḍim̐gāga (||||) vŏḍivaṭṭī nāgĕnu vŏḍam̐barasi nīgĕnu kaḍujāṇaramaṇum̐ḍu kāminulagu muḍigām̐ḍainavām̐ḍu mŏdalam̐ dānegām̐ḍā yĕḍamāḍalāḍi bayalīm̐dugŏnīm̐ gāga (||||) kalasīni javarālim̐ gām̐giliṁchī kanniyanu lali śhrīveṁkaḍeśhum̐ḍu lalanalagu yĕlami nannunu nelĕ ninniḍām̐ dāne kām̐ḍā valabulu pĕḍarem̐si vasamayyīm̐gāga