Title (Indic)విన్నపము సేయమనె వేడుకతో నీకు మమ్ము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) విన్నపము సేయమనె వేడుకతో నీకు మమ్ము చెన్నుమీరిన ట్టాయింతి చెలలము సుమ్మీ (॥॥) చిత్తమురా నీకు నాకె సేవలు సేయనేరుచు మొత్తముగాఁ బాదాలకు మొక్కనేరుచు పొత్తుకుఁ దీసి నిన్ను పొగడఁగనేరుచు ఇత్తల నేమిసేసేవు ఇంటికి రారాదా (॥॥) ఇచ్చకము సేసి నిన్ను నియ్యకొలుపనేరుచు నచ్చుదీర నీతోను నవ్వనేరుచు పచ్చిసేఁతలను నిన్ను పనిగొననేరుచు ఇచ్చితివి చనవులు యింటికి రారాదా (॥॥) అలమేలుమంగ యీకె అకెఁగూడఁగనేరుచు పొలఁతి శ్రీ వేంకటేశ భోగించనేర్చు అలరితి రింతలోనె ఆకె నీవు నిద్దరును యెలమితో నిట్లానే యింటికి రారాదా English(||pallavi||) vinnabamu seyamanĕ veḍugado nīgu mammu sĕnnumīrina ṭṭāyiṁti sĕlalamu summī (||||) sittamurā nīgu nāgĕ sevalu seyanerusu mŏttamugām̐ bādālagu mŏkkanerusu pŏttugum̐ dīsi ninnu pŏgaḍam̐ganerusu ittala nemisesevu iṁṭigi rārādā (||||) ichchagamu sesi ninnu niyyagŏlubanerusu nachchudīra nīdonu navvanerusu pachchisem̐talanu ninnu panigŏnanerusu ichchidivi sanavulu yiṁṭigi rārādā (||||) alamelumaṁga yīgĕ agĕm̐gūḍam̐ganerusu pŏlam̐ti śhrī veṁkaḍeśha bhogiṁchanersu alaridi riṁtalonĕ āgĕ nīvu niddarunu yĕlamido niṭlāne yiṁṭigi rārādā