Title (Indic)చక్కఁ గా నానతీవయ్య సమ్మతించేఁ గాని నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చక్కఁ గా నానతీవయ్య సమ్మతించేఁ గాని నేను పిక్కటిల్లుఁ గోరికలు పెనగొనెనా (॥॥) యెలమి మీరిద్దరును యేకతాన నుండితిరి చెలియ విన్నపములు చెవిఁ బట్టెనా నలువంక మీలోనే నవ్వుకొంటా నుండితిరి తలకొన్నవలపులు తారుకాణలాయనా (॥॥) పరగ నిద్దరు నుండి పందేలు వేసుకొంటిరి తరుణీసరసము చిత్తమువచ్చెనా మరుగుచు నొడఁబాటుమాట లాడుకొంటిరి యెరవులేనిపొందు లియ్యకొంటిరా (॥॥) వేడుకతో నీవునాకె విడేలందుకొంటిరి చేడెకు నీకాఁగిటిలో సిగ్గుదేరెనా యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె యీడుతో నీననుపులు యిరవాయనా English(||pallavi||) sakkam̐ gā nānadīvayya sammadiṁchem̐ gāni nenu pikkaḍillum̐ gorigalu pĕnagŏnĕnā (||||) yĕlami mīriddarunu yegadāna nuṁḍidiri sĕliya vinnabamulu sĕvim̐ baṭṭĕnā naluvaṁka mīlone navvugŏṁṭā nuṁḍidiri talagŏnnavalabulu tārugāṇalāyanā (||||) paraga niddaru nuṁḍi paṁdelu vesugŏṁṭiri taruṇīsarasamu sittamuvachchĕnā marugusu nŏḍam̐bāḍumāḍa lāḍugŏṁṭiri yĕravulenibŏṁdu liyyagŏṁṭirā (||||) veḍugado nīvunāgĕ viḍelaṁdugŏṁṭiri seḍĕgu nīgām̐giḍilo sigguderĕnā yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ yīḍudo nīnanubulu yiravāyanā