Title (Indic)ఎటువంటి జాణతన మేమి నేరుచుకొంటివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎటువంటి జాణతన మేమి నేరుచుకొంటివి సట లేల సేసేవు చలమా యిది (॥॥) నిలుచుండి పాదముల నిన్ను నింతి పెనఁచఁగా కలయకానవెట్టేది గర్వమా నీకు చెలరేఁగి గోర నొత్తి చేరి సన్న సేయఁ గాను పలుజీరలు సేసేది పంతమా యిది (॥॥) ముప్పిరి నాకుమడిచి మోవితేనే లందియ్యఁ గాను తప్పించుకొనేది దొరతనమా నీకు కొప్పువట్టి తీసి నిండుఁ గ్రొవ్విరులు ముడువఁ గా వుప్పతించి తిట్టేది వుదుటా యిది (॥॥) వుపరిసురతమున వూడిగము సేయఁ గాను వుపమించి నీవు గూడేవొరపా నీకు యిప్పుడె శ్రీ వేంకటేశ యూచెలి నీకు మొక్కఁ గా నెపముగా దీవించేవు నేరుపా యిది English(||pallavi||) ĕḍuvaṁṭi jāṇadana memi nerusugŏṁṭivi saḍa lela sesevu salamā yidi (||||) nilusuṁḍi pādamula ninnu niṁti pĕnam̐sam̐gā kalayagānavĕṭṭedi garvamā nīgu sĕlarem̐gi gora nŏtti seri sanna seyam̐ gānu palujīralu sesedi paṁtamā yidi (||||) muppiri nāgumaḍisi movidene laṁdiyyam̐ gānu tappiṁchugŏnedi dŏradanamā nīgu kŏppuvaṭṭi tīsi niṁḍum̐ grŏvvirulu muḍuvam̐ gā vuppadiṁchi tiṭṭedi vuduḍā yidi (||||) vubarisuradamuna vūḍigamu seyam̐ gānu vubamiṁchi nīvu gūḍevŏrabā nīgu yippuḍĕ śhrī veṁkaḍeśha yūsĕli nīgu mŏkkam̐ gā nĕbamugā dīviṁchevu nerubā yidi