Title (Indic)గద్దెమీఁద నుందానవు కాఁపురము సేసేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గద్దెమీఁద నుందానవు కాఁపురము సేసేవు పెద్దరికము చూపక పిరితీసేవా (॥॥) సేవచేసేదానవు చేరి నవ్వేదానవు నీవేకా ఆతనికి నేరుపుతోడ చేవదేరి వుందానవు సిగ్గులెల్లా నారితేరి మావంటిసవతుల మదిఁ దలచేవా (॥॥) యేకతమాడేదానవు ఇంపు చల్లేదానవు జోకతోడ నీవేకా చుట్టమవు చేకొని నీకిన్నిటాను చెల్లుబడి గలిగెను దీకొని నీతోడివారిదిక్కు చూచేవా (॥॥) కలిసినదానవు కందువ నున్న దానవు ఇల నీవేకా యితని ఇంపుదానవు యెలమి శ్రీవేంకటేశుఁ డితఁడే మమ్మెల్ల నేలె నెలవై నీచెల్లెండ్ల మన్నించక మానేవా English(||pallavi||) gaddĕmīm̐da nuṁdānavu kām̐puramu sesevu pĕddarigamu sūbaga piridīsevā (||||) sevasesedānavu seri navvedānavu nīvegā ādanigi nerubudoḍa sevaderi vuṁdānavu siggulĕllā nārideri māvaṁṭisavadula madim̐ dalasevā (||||) yegadamāḍedānavu iṁpu salledānavu jogadoḍa nīvegā suṭṭamavu segŏni nīginniḍānu sĕllubaḍi galigĕnu dīgŏni nīdoḍivāridikku sūsevā (||||) kalisinadānavu kaṁduva nunna dānavu ila nīvegā yidani iṁpudānavu yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe mammĕlla nelĕ nĕlavai nīsĕllĕṁḍla manniṁchaga mānevā