Title (Indic)ఆడకే విచ్చేయు మనె అంగన నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడకే విచ్చేయు మనె అంగన నిన్ను ఆడుకోలు మాటలే నీ కానవాలు (॥ఆడకే॥) పొలఁతి నిన్నంపుతానే పుక్కిటివీడెపుచద్ది అలరి పెట్టిన దొక్క టానవాలు చెలఁగి తాఁ గట్టినది చెంగావిదుప్పటము నిలువు గాశవోయుటే నీ కానవాలు (॥ఆడకే॥) నిన్నుఁ బొమ్మన లేక నిలుచుండి కౌఁగిలించి అన్నువ మో విచ్చినది ఆనవాలు కన్నులఁ దప్పక చూచి కంటమాల యెడఁ బెట్టి పన్ని తల వంచుకొన్న భావ మానవాలు (॥ఆడకే॥) పొంచి తన చెవి తట్టుపుణుఁగు చెక్కులనే అంచలఁ జమరీ వదే ఆనవాలు కొంచక శ్రీవేంకటేశ కొమ్మఁ గూడితి విట్టే ముంచి వేగమె రమ్మన్న మోహ మానవాలు English(||pallavi||) āḍage vichcheyu manĕ aṁgana ninnu āḍugolu māḍale nī kānavālu (||āḍage||) pŏlam̐ti ninnaṁpudāne pukkiḍivīḍĕbusaddi alari pĕṭṭina dŏkka ṭānavālu sĕlam̐gi tām̐ gaṭṭinadi sĕṁgāviduppaḍamu niluvu gāśhavoyuḍe nī kānavālu (||āḍage||) ninnum̐ bŏmmana lega nilusuṁḍi kaum̐giliṁchi annuva mo vichchinadi ānavālu kannulam̐ dappaga sūsi kaṁṭamāla yĕḍam̐ bĕṭṭi panni tala vaṁchugŏnna bhāva mānavālu (||āḍage||) pŏṁchi tana sĕvi taṭṭubuṇum̐gu sĕkkulane aṁchalam̐ jamarī vade ānavālu kŏṁchaga śhrīveṁkaḍeśha kŏmmam̐ gūḍidi viṭṭe muṁchi vegamĕ rammanna moha mānavālu