Title (Indic)తా నేమి సేసునే తన వోజ లింతే కాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నేమి సేసునే తన వోజ లింతే కాక నే నే వలచినదాననేఁ దన్ను దూరేనా (॥తానేమి॥) వుప్పతించి యాఁటదాని వొలిసీ నొల్లనివాఁడు చప్పఁగా మాటలాడి సాదించును చిప్పలఁగ నిమ్మపండు చేతికిఁ గాను కిచ్చితే చొప్పులెత్తి పులుసంటా సోదించవచ్చును (॥తానేమి॥) గక్కనఁ జేతికి లోనుగానియట్టి రమణుఁడు తక్కి వట్టి వలపులు తవ్వించును చిక్కించుకొని యప్పటిచేతికి వీడె మిచ్చితే కక్కసించి యంతలోనె కార మాయ ననును (॥తానేమి॥) జూటుఁ దనములవాఁడు సుదతులు నవ్వితేను పాటించి యారజమని పచ్చిసేసును యీటున శ్రీవేంకటేశుఁ డితఁడే నన్నుఁ గూడె గాటపు నామోవితేనె కడుఁ దీపు లనును English(||pallavi||) tā nemi sesune tana voja liṁte kāga ne ne valasinadānanem̐ dannu dūrenā (||tānemi||) vuppadiṁchi yām̐ṭadāni vŏlisī nŏllanivām̐ḍu sappam̐gā māḍalāḍi sādiṁchunu sippalam̐ga nimmabaṁḍu sedigim̐ gānu kichchide sŏppulĕtti pulusaṁṭā sodiṁchavachchunu (||tānemi||) gakkanam̐ jedigi lonugāniyaṭṭi ramaṇum̐ḍu takki vaṭṭi valabulu tavviṁchunu sikkiṁchugŏni yappaḍisedigi vīḍĕ michchide kakkasiṁchi yaṁtalonĕ kāra māya nanunu (||tānemi||) jūḍum̐ danamulavām̐ḍu sudadulu navvidenu pāḍiṁchi yārajamani pachchisesunu yīḍuna śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe nannum̐ gūḍĕ gāḍabu nāmovidenĕ kaḍum̐ dību lanunu