Title (Indic)మాకేమి విూ కెట్టున్నా మంచిదే నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేమి విూ కెట్టున్నా మంచిదే నేఁడు పైకొని విూవారమై బ్రదికేము నేము (॥మా కేమి॥) చెప్పినట్టు సేసేటి చేకొలది మగఁడాయ అప్పుడే సలిగగల ఆల వైతివి చెప్పరానిసంతోసాల చెలు లెల్లాఁ బొగడేరు చిప్పిలఁగ నవ్వవమ్మా సెలవుల నింకను (॥మా కేమి॥) కచ్చుపెట్టి నీ కతఁడు కాఁపురము సేసీని యిచ్చకురాలవు తొల్లే యితనికిని వచ్చి వచ్చి చూచేరు వాడవా రెల్లా మిమ్ము ముచ్చట లాడవమ్మా ముదితలతోడను (॥మా కేమి॥) దక్కి శ్రీవేంకటేశుఁడు తమ్ముల మిడెను నీకు తక్కక నీ కట్టే మదన మెత్తెను అక్కరతో నీ విభుని అంతలోనే కూడితిమి చొక్కుచుఁ బాడవమ్మాసోబానపాటలు English(||pallavi||) māgemi viూ kĕṭṭunnā maṁchide nem̐ḍu paigŏni viూvāramai bradigemu nemu (||mā kemi||) sĕppinaṭṭu seseḍi segŏladi magam̐ḍāya appuḍe saligagala āla vaidivi sĕpparānisaṁtosāla sĕlu lĕllām̐ bŏgaḍeru sippilam̐ga navvavammā sĕlavula niṁkanu (||mā kemi||) kachchubĕṭṭi nī kadam̐ḍu kām̐puramu sesīni yichchagurālavu tŏlle yidanigini vachchi vachchi sūseru vāḍavā rĕllā mimmu muchchaḍa lāḍavammā mudidaladoḍanu (||mā kemi||) dakki śhrīveṁkaḍeśhum̐ḍu tammula miḍĕnu nīgu takkaga nī kaṭṭe madana mĕttĕnu akkarado nī vibhuni aṁtalone kūḍidimi sŏkkusum̐ bāḍavammāsobānabāḍalu