Title (Indic)ఎడ గొల్లకత్తె యీపె యెవ్వతోయి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎడ గొల్లకత్తె యీపె యెవ్వతోయి అడియలా లెత్తీ నాతో నానతీవోయి (॥ఎడ॥) వాలికచూపుల నిన్ను వంచివంచి చూచీని అలా నీకు తానేమైనా నదేమి యీపె మేలమాడీ నప్పటిని మేకులు నీతోఁ జేసీ వోలి వెట్టించుక నిన్ను నొద్దికఁ బెండ్లాడెనా (॥ఎడ॥) పువ్వులు వేసి నిన్ను బొమ్మల జంకించీని దేవులా తా నేమైనా తెగడీ నీపె వావులు నీతోఁ జెప్పి వట్టిరసాలాడీ కావించి నీకుఁగాను కంకణము గట్టెనా (॥ఎడ॥) నంటున సంగడి నిన్ను నడుమఁగా గాఁగిట నించీ యింటి యాపే తాను నీకు నేమైనా నీపె జంట న న్నేలితివి సరుగ శ్రీవేంకటేశ దంటా తా నేమి తొల్లి తలఁబాలు వోసెనా English(||pallavi||) ĕḍa gŏllagattĕ yībĕ yĕvvadoyi aḍiyalā lĕttī nādo nānadīvoyi (||ĕḍa||) vāligasūbula ninnu vaṁchivaṁchi sūsīni alā nīgu tānemainā nademi yībĕ melamāḍī nappaḍini megulu nīdom̐ jesī voli vĕṭṭiṁchuga ninnu nŏddigam̐ bĕṁḍlāḍĕnā (||ĕḍa||) puvvulu vesi ninnu bŏmmala jaṁkiṁchīni devulā tā nemainā tĕgaḍī nībĕ vāvulu nīdom̐ jĕppi vaṭṭirasālāḍī kāviṁchi nīgum̐gānu kaṁkaṇamu gaṭṭĕnā (||ĕḍa||) naṁṭuna saṁgaḍi ninnu naḍumam̐gā gām̐giḍa niṁchī yiṁṭi yābe tānu nīgu nemainā nībĕ jaṁṭa na nnelidivi saruga śhrīveṁkaḍeśha daṁṭā tā nemi tŏlli talam̐bālu vosĕnā