Title (Indic)అంగన సుద్దులు నీ వేమడిగేవయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అంగన సుద్దులు నీ వేమడిగేవయ్యా చెంగట నుండి నీవే చిత్తగించవయ్యా (॥అంగ॥) చెలియ నీరూపము చిత్తరుపటాన వ్రాసి పొలుపు మిగులఁ దానే పూజించును కొలువుసేసి మరి కొంతవడి నీపేరు పలుమారు నొడివి జపము సేసును (॥అంగ॥) సరుగఁ బొద్దున వంట చవులుగా వండి వండి పరగఁగ నీకు నుపార మిచ్చును అరిది నీప్రసాద మారగించి నీపతిమఁ నురమునఁ బెట్టుకొని వుయ్యాల లూఁచును (॥అంగ॥) బాగాలు నీ కొప్పసేసి భావము నీపైఁ బెట్టి యైగిణి(ని?)యై నందాన నోలలాడును యీగతి శ్రీవేంకటేశ యేలితి వింతలో వచ్చి ఆగురుతు లెల్లాఁ జూడు మట్టె నీకు మొక్కును English(||pallavi||) aṁgana suddulu nī vemaḍigevayyā sĕṁgaḍa nuṁḍi nīve sittagiṁchavayyā (||aṁga||) sĕliya nīrūbamu sittarubaḍāna vrāsi pŏlubu migulam̐ dāne pūjiṁchunu kŏluvusesi mari kŏṁtavaḍi nīberu palumāru nŏḍivi jabamu sesunu (||aṁga||) sarugam̐ bŏdduna vaṁṭa savulugā vaṁḍi vaṁḍi paragam̐ga nīgu nubāra michchunu aridi nīprasāda māragiṁchi nībadimam̐ nuramunam̐ bĕṭṭugŏni vuyyāla lūm̐sunu (||aṁga||) bāgālu nī kŏppasesi bhāvamu nībaim̐ bĕṭṭi yaigiṇi(ni?)yai naṁdāna nolalāḍunu yīgadi śhrīveṁkaḍeśha yelidi viṁtalo vachchi āgurudu lĕllām̐ jūḍu maṭṭĕ nīgu mŏkkunu