Title (Indic)ఆతఁడదె మీరదె అప్పగించితిమి నేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడదె మీరదె అప్పగించితిమి నేము మీ తలఁపుదాన నేను మీకేలే చింత (॥ఆత॥) నన్నునేల అడిగేరే నాఁటినేఁటిసుద్దులు అన్నియును నడుగరే ఆతనిని పన్నినవారిద్దరికి పైపై మీరే కారా వెన్న చేతఁ బట్టుకొని వేఁడనేలే నెయ్యి (॥ఆత॥) యేల కొడఁబరచేరే యింతలోనే నన్నును చాలు నొడఁబరచరే చాలు నాతని పోలిమితో నింతేసిబుద్ది మీ రెరఁగనిదా తాలము చేతఁబట్టుకొని దాఁటనేలే వాకిలి (॥ఆత॥) ఆన లేల పెట్టేరే ఆతనితోఁ గూడుమని పేని యాన లతనికే పెట్టరాదా ఆనుక శ్రీ వేంకటేశుఁడాతఁడే నన్నుఁ గూడె తేనెలువంటిచెలులు తీపులు మీకేలే English(||pallavi||) ādam̐ḍadĕ mīradĕ appagiṁchidimi nemu mī talam̐pudāna nenu mīgele siṁta (||āda||) nannunela aḍigere nām̐ṭinem̐ṭisuddulu anniyunu naḍugare ādanini panninavāriddarigi paibai mīre kārā vĕnna sedam̐ baṭṭugŏni vem̐ḍanele nĕyyi (||āda||) yela kŏḍam̐barasere yiṁtalone nannunu sālu nŏḍam̐barasare sālu nādani polimido niṁtesibuddi mī rĕram̐ganidā tālamu sedam̐baṭṭugŏni dām̐ṭanele vāgili (||āda||) āna lela pĕṭṭere ādanidom̐ gūḍumani peni yāna ladanige pĕṭṭarādā ānuga śhrī veṁkaḍeśhum̐ḍādam̐ḍe nannum̐ gūḍĕ tenĕluvaṁṭisĕlulu tībulu mīgele