Title (Indic)ఆఁటది గొసరితేను ఆదరించవలెఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటది గొసరితేను ఆదరించవలెఁ గాక యేఁటి మగవాఁడ వైతి వింత నీకమరునా (॥ఆఁట॥) నగకుండితే నగవు ననుచనికోపాన మొగ మియ్యకుండితేను మోము వంచేవు జిగి నే నలిగి యేమి సేసినాఁ జెల్లుఁ గాక యెగక్కెపవలప లివి నీకుఁ జెల్లునా (॥ఆఁట॥) ములుగుతా నే నుండితే ముంగిటనే వున్నాఁడవు అలరి పలువకున్న నండకు రావు చెలిమిబలిమిదాన సాదించ నాకుఁ దగితే అలవోక సరిపంతా లవి నీకుఁ దగునా (॥ఆఁట॥) కందువ నే నంటితేను కాఁగిట నీవు నించేవు యిందునె శ్రీ వేంకటేశ యేలితి నన్ను మందెమేళమైన నామనసే మెత్తువు గాక నిందల నీ గుణములు నీకు నీవే మెత్తువా English(||pallavi||) ām̐ṭadi gŏsaridenu ādariṁchavalĕm̐ gāga yem̐ṭi magavām̐ḍa vaidi viṁta nīgamarunā (||ām̐ṭa||) nagaguṁḍide nagavu nanusanigobāna mŏga miyyaguṁḍidenu momu vaṁchevu jigi ne naligi yemi sesinām̐ jĕllum̐ gāga yĕgakkĕbavalaba livi nīgum̐ jĕllunā (||ām̐ṭa||) mulugudā ne nuṁḍide muṁgiḍane vunnām̐ḍavu alari paluvagunna naṁḍagu rāvu sĕlimibalimidāna sādiṁcha nāgum̐ dagide alavoga saribaṁtā lavi nīgum̐ dagunā (||ām̐ṭa||) kaṁduva ne naṁṭidenu kām̐giḍa nīvu niṁchevu yiṁdunĕ śhrī veṁkaḍeśha yelidi nannu maṁdĕmeḽamaina nāmanase mĕttuvu gāga niṁdala nī guṇamulu nīgu nīve mĕttuvā