Title (Indic)ఇచ్చకమె సేయవే యీ చలము మానవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకమె సేయవే యీ చలము మానవే ముచ్చటకు వచ్చు సరిమోహము లైతేను (॥ఇచ్చ॥) అసలు రేఁచి యాతఁ డట్టె నిన్నుఁజెనకఁగా వాసులకే పెనఁగేవు వద్దే యింత పూస గుచ్చినట్టు నీకు బుద్దులు చెప్పితిఁగా రాసి కెక్కఁ గోమలము(లు?) రాజుల చిత్తములు (॥ఇచ్చ॥) చేయి వట్టి నీవిభుడు చెక్కులు నిన్ను నొక్కఁగా రాయడించి మాటాలాడేరాఁపు చెల్లదే నీయితపు నేఁగోరి నిండుకొని వున్నదాన వోయమ్మ ఆతని నింత వొరయఁగ నేఁటికే (॥ఇచ్చ॥) శ్రీ వేంకటేశుఁడు నిన్నుఁజేకొని కాఁగిలించఁగా భావించుకో నిఁక నేల పై నరాదా నీవు నాతఁ డుఁగూడిననేమము నే నెరుఁగుదు దైవ మొక్కటిగాఁ జేసె దయగలఁ డాతఁడు English(||pallavi||) ichchagamĕ seyave yī salamu mānave muchchaḍagu vachchu sarimohamu laidenu (||ichcha||) asalu rem̐si yādam̐ ḍaṭṭĕ ninnum̐jĕnagam̐gā vāsulage pĕnam̐gevu vadde yiṁta pūsa guchchinaṭṭu nīgu buddulu sĕppidim̐gā rāsi kĕkkam̐ gomalamu(lu?) rājula sittamulu (||ichcha||) seyi vaṭṭi nīvibhuḍu sĕkkulu ninnu nŏkkam̐gā rāyaḍiṁchi māḍālāḍerām̐pu sĕllade nīyidabu nem̐gori niṁḍugŏni vunnadāna voyamma ādani niṁta vŏrayam̐ga nem̐ṭige (||ichcha||) śhrī veṁkaḍeśhum̐ḍu ninnum̐jegŏni kām̐giliṁcham̐gā bhāviṁchugo nim̐ka nela pai narādā nīvu nādam̐ ḍum̐gūḍinanemamu ne nĕrum̐gudu daiva mŏkkaḍigām̐ jesĕ dayagalam̐ ḍādam̐ḍu