Title (Indic)ఆలికి మగనికి సిగ్గంత చెల్లునా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆలికి మగనికి సిగ్గంత చెల్లునా మేలుమీఁదివాఁడవు మెచ్చఁగద వోయి (॥ఆలి॥) భాపములో బయలీఁత పాదపునేలల వాఁత యీపలఁ గంటివా వోయి యీపెవల్లను నీవద్ద నుండే నీతోఁ బలికేబాస చేవదేరీ నీకెవల్లఁ జిత్తగించ వోయి (॥ఆలి॥) కన్నుల నీమీఁదిచూపు కాఁకలలో తరితీపు చెన్ను మీరె నిది దెలిసితివా వోయి మున్నిటి మాటలపొందు మోవిపై తేనెల విందు సన్నల నీకీపెఁ జూపీఁ జన వియ్యవోయి (॥ఆలి॥) విరహపుపసివాడు వెలయ నీతో జోడు గరిమ నబ్బెనా యీకేకాఁగిట నోయి నిరతి శ్రీ వేంకటేశ నేఁడు నన్నుఁ గూడితివి సరివచ్చేనా రతి జాడల నోయి English(||pallavi||) āligi maganigi siggaṁta sĕllunā melumīm̐divām̐ḍavu mĕchcham̐gada voyi (||āli||) bhābamulo bayalīm̐ta pādabunelala vām̐ta yībalam̐ gaṁṭivā voyi yībĕvallanu nīvadda nuṁḍe nīdom̐ baligebāsa sevaderī nīgĕvallam̐ jittagiṁcha voyi (||āli||) kannula nīmīm̐disūbu kām̐kalalo taridību sĕnnu mīrĕ nidi dĕlisidivā voyi munniḍi māḍalabŏṁdu movibai tenĕla viṁdu sannala nīgībĕm̐ jūbīm̐ jana viyyavoyi (||āli||) virahabubasivāḍu vĕlaya nīdo joḍu garima nabbĕnā yīgegām̐giḍa noyi niradi śhrī veṁkaḍeśha nem̐ḍu nannum̐ gūḍidivi sarivachchenā radi jāḍala noyi