Title (Indic)ఆతని నేల సాదించే వప్పుడే నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని నేల సాదించే వప్పుడే నీవు మాతోడిదానవా మగువరో నీవు (॥ఆత॥) వాసితోడఁ బెనఁగేటివలపు లీడేరుఁ గాక వేసరి అలుగఁబోతే వేడుక లౌనా సేసతోఁ బెండ్లాడినదే చెల్లుబళ్లౌఁ గాక పూసుగోఁడై అంటుకొన్న పొందులు నిజమౌనా (॥ఆత॥) చేకొలఁది మెలఁగితే చేఁతలెల్లఁ జెల్లుఁగాక దీకొని బలిమి సేసితే మెచ్చౌనా యేకడా మంచిగుణాలే యెన్నికకు నెక్కుఁగాక కాకరి విద్యలకకు లోకమువారు మెత్తురా (॥ఆత॥) పాయకున్న కూటమికి బావము గరఁగుఁ గాక చాయపాటు చెనకులు చవు లయ్యీనా యీ యడ శ్రీ వేంకటేశుఁడేలె నన్ను నీ వనిత నాయీడుకుఁ గూడితివి ననువయ్యీనా English(||pallavi||) ādani nela sādiṁche vappuḍe nīvu mādoḍidānavā maguvaro nīvu (||āda||) vāsidoḍam̐ bĕnam̐geḍivalabu līḍerum̐ gāga vesari alugam̐bode veḍuga launā sesadom̐ bĕṁḍlāḍinade sĕllubaḽlaum̐ gāga pūsugom̐ḍai aṁṭugŏnna pŏṁdulu nijamaunā (||āda||) segŏlam̐di mĕlam̐gide sem̐talĕllam̐ jĕllum̐gāga dīgŏni balimi seside mĕchchaunā yegaḍā maṁchiguṇāle yĕnnigagu nĕkkum̐gāga kāgari vidyalagagu logamuvāru mĕtturā (||āda||) pāyagunna kūḍamigi bāvamu garam̐gum̐ gāga sāyabāḍu sĕnagulu savu layyīnā yī yaḍa śhrī veṁkaḍeśhum̐ḍelĕ nannu nī vanida nāyīḍugum̐ gūḍidivi nanuvayyīnā