Title (Indic)ఆహా యేమి చెప్పేది హరి నీ చిక్కు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆహా యేమి చెప్పేది హరి నీ చిక్కు ఊహాపోహలచేత వుడివోవు వయసు (॥ఆ హా॥) చేతఁ జిక్కినట్లుండు చెప్పినదాఁకా జ్ఞానము ఆతలఁ గడచితేను అట్టటు వోవు ఱాతఁ జేసినట్టుండు నాఱడి దేహ మాయుష్యముతో ఆతుమ యెడసితేను అదవదలవును (॥ఆ హా॥) నిక్కమువలెనే వుండు నిద్రించుదాఁకాఁ గల పక్కన మేలుకొంటేను బట్టబయలు దక్కిన యట్లనే వుండు ధనధాన్యములు యింట చక్క ననుభవించితే సరికి సరి యౌను (॥ఆ హా॥) సులభమువలె నుండు చూచేటి యీ లోకము యిలఁ జేకొనఁ గోరితే నెల యించును యెలమి శ్రీవేంకటేశ యిది నీ కల్పితమే తలపోసి మెలఁగ నీదాసు లెఱుఁగుదురు English(||pallavi||) āhā yemi sĕppedi hari nī sikku ūhābohalaseda vuḍivovu vayasu (||ā hā||) sedam̐ jikkinaṭluṁḍu sĕppinadām̐kā jñānamu ādalam̐ gaḍasidenu aṭṭaḍu vovu ṟādam̐ jesinaṭṭuṁḍu nāṟaḍi deha māyuṣhyamudo āduma yĕḍasidenu adavadalavunu (||ā hā||) nikkamuvalĕne vuṁḍu nidriṁchudām̐kām̐ gala pakkana melugŏṁṭenu baṭṭabayalu dakkina yaṭlane vuṁḍu dhanadhānyamulu yiṁṭa sakka nanubhaviṁchide sarigi sari yaunu (||ā hā||) sulabhamuvalĕ nuṁḍu sūseḍi yī logamu yilam̐ jegŏnam̐ goride nĕla yiṁchunu yĕlami śhrīveṁkaḍeśha yidi nī kalbidame talabosi mĕlam̐ga nīdāsu lĕṟum̐guduru