Title (Indic)కంటి మన్నిటి సత్వలు కమలాక్ష యిఁక నీవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కంటి మన్నిటి సత్వలు కమలాక్ష యిఁక నీవే యింటి వేలుపవై మమ్ము నీడేర్తువు గాకా (॥కంటి॥) తొల్లి లేదా జ్ఞానము తొడరి యాతుమలోన అల్లన మోక్షము చూపదాయఁ గాక చల్లఁగా మనసె కాదా చవు లెల్లాఁ జూపినది వెల్లిగా బ్రహ్మానందము వెదకదు గాకా (॥కంటి॥) యిరవై యారుశాస్త్రము లివే కావా చదివేవి హరి నిన్ను బోధింప వాయఁ గాక గరిమ నీలోకములే కావా చొచ్చి వెళ్ళేవి విరక్తుఁ జేసి కర్మము విడ్చదాయఁ గాకా (॥కంటి॥) చెప్పుడు బుద్ధులే కావా చెవులలో నిండినవి చిప్పిల నీ భక్తునిఁగాఁ జేయవు గాక యిప్పుడే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె యెప్పటి నేనే కాదా యిఁకఁ బాయఁ గాకా English(||pallavi||) kaṁṭi manniḍi satvalu kamalākṣha yim̐ka nīve yiṁṭi velubavai mammu nīḍerduvu gāgā (||kaṁṭi||) tŏlli ledā jñānamu tŏḍari yādumalona allana mokṣhamu sūbadāyam̐ gāga sallam̐gā manasĕ kādā savu lĕllām̐ jūbinadi vĕlligā brahmānaṁdamu vĕdagadu gāgā (||kaṁṭi||) yiravai yāruśhāstramu live kāvā sadivevi hari ninnu bodhiṁpa vāyam̐ gāga garima nīlogamule kāvā sŏchchi vĕḽḽevi viraktum̐ jesi karmamu viḍchadāyam̐ gāgā (||kaṁṭi||) sĕppuḍu buddhule kāvā sĕvulalo niṁḍinavi sippila nī bhaktunim̐gām̐ jeyavu gāga yippuḍe śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ yĕppaḍi nene kādā yim̐kam̐ bāyam̐ gāgā