Title (Indic)ఎచ్చరి బ్రదుకవలె యెఱిఁగినవారికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎచ్చరి బ్రదుకవలె యెఱిఁగినవారికి తెచ్చుకొనేమంటే బట్టి తేరాదు కాలము (॥ఎచ్చరి॥) చేసినపుణ్యము దక్కు చెల్లుబడి గల నాఁడే వేసాల సంపద లెల్ల వెంట రావు ఆసలాసలనుఁ జిక్కి యవి దనవిగాఁ జూచి మోసపోతే మఱి లేదు మొనయడు జన్మము (॥ఎచ్చరి॥) కైకొన్నవ్రత మీడేరు కాయముతో నున్నప్పుడే కాకరిసంసార మిది కాణాచి గాదు లోకమువారలఁ జూచి లోలుఁడై చవులకు లాచి కాకైతే మఱి లేద గరిపడు జన్మము (॥ఎచ్చరి॥) సర్వము సాధించవచ్చు జ్ఞానముతో నున్నవాఁడే నిర్వహించఁబోతే మఱి నిలుపరాదు వుర్వి శ్రీవేంకటేశ్వర వూహించ నేరక గర్వియైతే మఱి లేదు కడ మవును జన్మము English(||pallavi||) ĕchchari bradugavalĕ yĕṟim̐ginavārigi tĕchchugŏnemaṁṭe baṭṭi terādu kālamu (||ĕchchari||) sesinabuṇyamu dakku sĕllubaḍi gala nām̐ḍe vesāla saṁpada lĕlla vĕṁṭa rāvu āsalāsalanum̐ jikki yavi danavigām̐ jūsi mosabode maṟi ledu mŏnayaḍu janmamu (||ĕchchari||) kaigŏnnavrada mīḍeru kāyamudo nunnappuḍe kāgarisaṁsāra midi kāṇāsi gādu logamuvāralam̐ jūsi lolum̐ḍai savulagu lāsi kāgaide maṟi leda garibaḍu janmamu (||ĕchchari||) sarvamu sādhiṁchavachchu jñānamudo nunnavām̐ḍe nirvahiṁcham̐bode maṟi nilubarādu vurvi śhrīveṁkaḍeśhvara vūhiṁcha neraga garviyaide maṟi ledu kaḍa mavunu janmamu