Title (Indic)ఆతుమ సంతోసపెట్టు టది యెఱుక తా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతుమ సంతోసపెట్టు టది యెఱుక తా- నే తెరువు వొల్లకుండు టిదియె యెఱుక (॥ఆతుమ॥) ముంచిన బంధముల మునుఁగువడక తా నంచల విడఁ దన్నుటది యెఱుక చంచలపు విషయాల సగ్గుడు ముగ్గుడు గాక యెంచి హరిఁ దలపోయు టిదియె యెఱుక (॥ఆతుమ॥) పాయని యర్థములకు బంటుబంటై తిరుగక ఆయితమై మోసపోని దది యెఱుక పాయపు కామినులతో పలుమారుఁ జేయుపొందు హేమముగఁ దలపోయు టిదియె యెఱుక (॥ఆతుమ॥) ధరమీఁదఁ గల ప్రాణితతుల నొప్పించక అరయఁగ సముఁడవుట అది యెఱుక గరిమిల శ్రీవేంకటపతి దాసుఁడై యిరవొంద సుఖియించు టిదియె యెఱుక English(||pallavi||) āduma saṁtosabĕṭṭu ṭadi yĕṟuga tā- ne tĕruvu vŏllaguṁḍu ṭidiyĕ yĕṟuga (||āduma||) muṁchina baṁdhamula munum̐guvaḍaga tā naṁchala viḍam̐ dannuḍadi yĕṟuga saṁchalabu viṣhayāla sagguḍu mugguḍu gāga yĕṁchi harim̐ dalaboyu ṭidiyĕ yĕṟuga (||āduma||) pāyani yardhamulagu baṁṭubaṁṭai tirugaga āyidamai mosaboni dadi yĕṟuga pāyabu kāminulado palumārum̐ jeyubŏṁdu hemamugam̐ dalaboyu ṭidiyĕ yĕṟuga (||āduma||) dharamīm̐dam̐ gala prāṇidadula nŏppiṁchaga arayam̐ga samum̐ḍavuḍa adi yĕṟuga garimila śhrīveṁkaḍabadi dāsum̐ḍai yiravŏṁda sukhiyiṁchu ṭidiyĕ yĕṟuga