Title (Indic)ఆపె నాదరించరాదా అందుకు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె నాదరించరాదా అందుకు నీవు యేపునఁ బొందులు దక్కె నిఁకనేల మరఁగు (॥ఆప॥) కన్నుల నీకాపె మొక్కె కంటివో లేదో నీవు సన్నలనే తెలిసి వంచన సేసేవో పన్నుకొన్న సిగ్గుతోడ పరాకులు చూపేవో యిన్నియు నేనెరిఁగితి నిఁకనేల మరఁగు (॥ఆప॥) పిసి పిసి మాటలాడెఁ బ్రేమతో వింటివో లేదో వెస నందుకుఁ జొక్కి నివ్వెరగైతివో కొసరి దొరతనాన గుట్టుసేసు కున్నాఁడవొ యెసఁగె నీకోరికలు యిఁకనేల మరఁగు (॥ఆప॥) ఇంచుకంత నవ్వు నవ్వె యెరిఁగితివో లేదో పొంచి యిప్పుడే కూడి పొద్దు పుచ్చేవో మంచితనములు సేసి మరియు నన్నేలితివి యెంచఁగ శ్రీవేంకటేశ యిఁకనేల మరఁగు English(||pallavi||) ābĕ nādariṁcharādā aṁdugu nīvu yebunam̐ bŏṁdulu dakkĕ nim̐kanela maram̐gu (||āba||) kannula nīgābĕ mŏkkĕ kaṁṭivo ledo nīvu sannalane tĕlisi vaṁchana sesevo pannugŏnna siggudoḍa parāgulu sūbevo yinniyu nenĕrim̐gidi nim̐kanela maram̐gu (||āba||) pisi pisi māḍalāḍĕm̐ bremado viṁṭivo ledo vĕsa naṁdugum̐ jŏkki nivvĕragaidivo kŏsari dŏradanāna guṭṭusesu kunnām̐ḍavŏ yĕsam̐gĕ nīgorigalu yim̐kanela maram̐gu (||āba||) iṁchugaṁta navvu navvĕ yĕrim̐gidivo ledo pŏṁchi yippuḍe kūḍi pŏddu puchchevo maṁchidanamulu sesi mariyu nannelidivi yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yim̐kanela maram̐gu