Title (Indic)ఆపె నీకుఁ దగు నీవు నాపెకే తగుదువయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె నీకుఁ దగు నీవు నాపెకే తగుదువయ్య చేపట్టి మీ యిద్దరికిఁ జెప్పరాదు మోహము (॥ఆప॥) తామెరరేకులవంటి తగునీకన్ను లనుచుఁ దామెరలే చేతఁబట్టెఁ దరుణి కామించి పాలజలధికడఁ బవ్వళింతు వని కోమలి పాలజలధి కూతురాయ నదివో (॥ఆపె॥) బంగారు పచ్చడము నీపైఁ గప్పితి వంచు బంగారుపతిమాయఁ బడఁతి అంగవించె నీపాద మాకాశ మంటాను అంగన తననడుము ఆకసముఁ బోలెను (॥ఆపె॥) కొండపై శ్రీవేంకటేశ కోరి నీ వెక్కితి వని కొండవంటి నీవురము కొమ్మ యెక్కెను అండనలమేలుమంగ ఆపె నీకుఁ గలుగఁగా నండ నీదాసులకు నీ వాపె యూ గలిగితిరి English(||pallavi||) ābĕ nīgum̐ dagu nīvu nābĕge taguduvayya sebaṭṭi mī yiddarigim̐ jĕpparādu mohamu (||āba||) tāmĕraregulavaṁṭi tagunīgannu lanusum̐ dāmĕrale sedam̐baṭṭĕm̐ daruṇi kāmiṁchi pālajaladhigaḍam̐ bavvaḽiṁtu vani komali pālajaladhi kūdurāya nadivo (||ābĕ||) baṁgāru pachchaḍamu nībaim̐ gappidi vaṁchu baṁgārubadimāyam̐ baḍam̐ti aṁgaviṁchĕ nībāda māgāśha maṁṭānu aṁgana tananaḍumu āgasamum̐ bolĕnu (||ābĕ||) kŏṁḍabai śhrīveṁkaḍeśha kori nī vĕkkidi vani kŏṁḍavaṁṭi nīvuramu kŏmma yĕkkĕnu aṁḍanalamelumaṁga ābĕ nīgum̐ galugam̐gā naṁḍa nīdāsulagu nī vābĕ yū galigidiri