Title (Indic)ఆసగా నెవ్వరికైన నడ్డపెట్టరానిది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆసగా నెవ్వరికైన నడ్డపెట్టరానిది పోసరించె నా వలపు పొంచి పొంచి నిన్నును (॥ఆస॥) తీపులనీమాటలనే తేలి తేలి చొక్కి చొక్కి మాపుదాఁకా నీవద్ద మరిగుంటిని యేపొద్దు గరుణించేవో యింటి కెన్నఁడు వచ్చేవో మూపులు మూఁడాయి నీమోము చూచి నాకు (॥ఆస॥) వేడుక నీపసలకే వెంట వెంటఁ గాచి కాచి తోడు నీడై నే నీతో దొరసితిని కూడేటివేళ యెప్పుడో గురి యిందు మోఁచీనో వాడు దేరితిమి నీవారమైనయపుడే (॥ఆస॥) చేత నీవంటినందుకే చిక్కి చిక్కి మొక్కి మొక్కి కాతరపు నీకాఁగిటఁ గలసితిని యీతల శ్రీవేంకటేశ యిఁక నీచిత్తమెట్లో పోతరించి నీరతుల పొందులనే మెచ్చితిని English(||pallavi||) āsagā nĕvvarigaina naḍḍabĕṭṭarānidi posariṁchĕ nā valabu pŏṁchi pŏṁchi ninnunu (||āsa||) tībulanīmāḍalane teli teli sŏkki sŏkki mābudām̐kā nīvadda mariguṁṭini yebŏddu garuṇiṁchevo yiṁṭi kĕnnam̐ḍu vachchevo mūbulu mūm̐ḍāyi nīmomu sūsi nāgu (||āsa||) veḍuga nībasalage vĕṁṭa vĕṁṭam̐ gāsi kāsi toḍu nīḍai ne nīdo dŏrasidini kūḍeḍiveḽa yĕppuḍo guri yiṁdu mom̐sīno vāḍu deridimi nīvāramainayabuḍe (||āsa||) seda nīvaṁṭinaṁduge sikki sikki mŏkki mŏkki kādarabu nīgām̐giḍam̐ galasidini yīdala śhrīveṁkaḍeśha yim̐ka nīsittamĕṭlo podariṁchi nīradula pŏṁdulane mĕchchidini