Title (Indic)ఇంత నేరమే నేము యిచ్చకములే సేతుము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంత నేరమే నేము యిచ్చకములే సేతుము చెంతలనే కిందుపరచితివే విభుని (॥ఇంత॥) మొక్కలాన నదలించి మొనచూపులనుఁ జూచి వెక్కసాన వంచుకొంటివే పతిని చక్కనిగోరు మోఁపి చలములు సాదించి గుక్కక యిన్నిటాఁ బనిగొంటివే విభుని (॥ఇంత॥) పొరలింపు మాటలాడి బొమ్మలను జంకించి వెరసుగ సాదించితివే విభుని తెరమరఁగుకుఁ దీసి దీకొని చన్నులనొత్తి గురుసు మోవ లోఁజేకొంటివే విభుని (॥ఇంత॥) కలకల నవ్వు నవ్వి గక్కననుఁ గాఁగిలించి కలిసితివే శ్రీ వేంకటవిభుని అలపులెల్లాఁ దీరిచి అట్టె మర్మములంటి కొలిపి మమ్మేలించి చేకొంటివే విభుని English(||pallavi||) iṁta nerame nemu yichchagamule sedumu sĕṁtalane kiṁdubarasidive vibhuni (||iṁta||) mŏkkalāna nadaliṁchi mŏnasūbulanum̐ jūsi vĕkkasāna vaṁchugŏṁṭive padini sakkanigoru mom̐pi salamulu sādiṁchi gukkaga yinniḍām̐ banigŏṁṭive vibhuni (||iṁta||) pŏraliṁpu māḍalāḍi bŏmmalanu jaṁkiṁchi vĕrasuga sādiṁchidive vibhuni tĕramaram̐gugum̐ dīsi dīgŏni sannulanŏtti gurusu mova lom̐jegŏṁṭive vibhuni (||iṁta||) kalagala navvu navvi gakkananum̐ gām̐giliṁchi kalisidive śhrī veṁkaḍavibhuni alabulĕllām̐ dīrisi aṭṭĕ marmamulaṁṭi kŏlibi mammeliṁchi segŏṁṭive vibhuni