Title (Indic)ఆసోదకాఁడవు అన్నిటికి నోపుదువు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆసోదకాఁడవు అన్నిటికి నోపుదువు మోసపోకుండా నీపై మూట గట్టేఁ జుమ్మీ (॥ఆసో॥) వెలవెట్టని వలపు వెస చల్లదుబ్బెఁడేసి పొలసి గొల్లెతలెల్లాఁ బోసిరి నీకు మలసి మామీఁదనట్టె మారుగొల గొలచేవు కలిగినదెల్లా నీకే గాదెఁ బోసేఁ జుమ్మీ (॥అసో॥) సుంకము లేనివలపు సూటి చనుగుబ్బెఁడేసి అంకెలఁ బదారువేలు అమ్మిరి నీకు పొంకాన నదె తలపోసేవు నాతోను పంకించక నీకన్నియుఁ బౌఁజు చూపేఁ జుమ్మీ (॥అసో॥) కొల్లవచ్చినవలపు కోరికెతో సందెఁడేసి వల్లెవేసి యెనమండ్రు వంచిరి నీకు యిల్లిదే యలమేలుమంగ నిదె నన్నూ నేలితివి వొల్లనే శ్రీ వేంకటేశ వొడిగట్టే జుమ్మీ English(||pallavi||) āsodagām̐ḍavu anniḍigi nobuduvu mosaboguṁḍā nībai mūḍa gaṭṭem̐ jummī (||āso||) vĕlavĕṭṭani valabu vĕsa salladubbĕm̐ḍesi pŏlasi gŏllĕdalĕllām̐ bosiri nīgu malasi māmīm̐danaṭṭĕ mārugŏla gŏlasevu kaliginadĕllā nīge gādĕm̐ bosem̐ jummī (||aso||) suṁkamu lenivalabu sūḍi sanugubbĕm̐ḍesi aṁkĕlam̐ badāruvelu ammiri nīgu pŏṁkāna nadĕ talabosevu nādonu paṁkiṁchaga nīganniyum̐ baum̐ju sūbem̐ jummī (||aso||) kŏllavachchinavalabu korigĕdo saṁdĕm̐ḍesi vallĕvesi yĕnamaṁḍru vaṁchiri nīgu yillide yalamelumaṁga nidĕ nannū nelidivi vŏllane śhrī veṁkaḍeśha vŏḍigaṭṭe jummī