Title (Indic)నేమటువంటివారమా నీవెరఁగ వింతె కాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేమటువంటివారమా నీవెరఁగ వింతె కాక దోమటి యెందైనానుఁ దొడికేవు గాక (॥నేమటు॥) అమ్మమాటలెల్లా నీకు నట్టే విన్నవించరాఁగా యెమ్మెలకు నీవు నాకొంగేల పట్టేవు దొమ్మికాఁడ గొల్లెతలఁ దొడికిన యలవాటు ఇమ్ముల నెవ్వరిఁ గన్నా నేల మానునయ్యా (॥నేమటు॥) యేలినాపె నీకు విడెమిచ్చి రమ్మని యంపఁగా కాలు దొక్కి నన్ను నేల కాఁగిలించేవు ఆలరీఁడ రుక్మిణిఁ బయ్యాడించి తెచ్చినలవాటు పోలిమి తో నంటుఁగాక పోనిచ్చునటయ్యా (॥నేమటు॥) అక్క నన్నుఁ దోడువెట్టు కట్టే నీవద్దికి రాఁగా గక్కనఁ దోడఁ బెండ్లి గైకొంటివి చక్కని శ్రీవేంకటేశ జమళి పెండ్లె లవాటు తొక్కి తొక్కి నీకు వెన్నతోనే పెట్టిరయ్యా English(||pallavi||) nemaḍuvaṁṭivāramā nīvĕram̐ga viṁtĕ kāga domaḍi yĕṁdainānum̐ dŏḍigevu gāga (||nemaḍu||) ammamāḍalĕllā nīgu naṭṭe vinnaviṁcharām̐gā yĕmmĕlagu nīvu nāgŏṁgela paṭṭevu dŏmmigām̐ḍa gŏllĕdalam̐ dŏḍigina yalavāḍu immula nĕvvarim̐ gannā nela mānunayyā (||nemaḍu||) yelinābĕ nīgu viḍĕmichchi rammani yaṁpam̐gā kālu dŏkki nannu nela kām̐giliṁchevu ālarīm̐ḍa rukmiṇim̐ bayyāḍiṁchi tĕchchinalavāḍu polimi to naṁṭum̐gāga ponichchunaḍayyā (||nemaḍu||) akka nannum̐ doḍuvĕṭṭu kaṭṭe nīvaddigi rām̐gā gakkanam̐ doḍam̐ bĕṁḍli gaigŏṁṭivi sakkani śhrīveṁkaḍeśha jamaḽi pĕṁḍlĕ lavāḍu tŏkki tŏkki nīgu vĕnnadone pĕṭṭirayyā