Title (Indic)ఆయ రావయ్య లోనికి నారగింతువు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయ రావయ్య లోనికి నారగింతువు కాయమెంత అంటినాను కరఁగీ నామనసు (॥ఆయ॥) ఏడనుండి వచ్చి సతులెందరు చెనకినాను వేడుకకాఁడవు నీవు వేసరేవా జాడతోడ మదనశాస్త్రము లెన్ని చదివినా తోడనే నీవీనుల గొందులు తనిసీనా (॥ఆయ॥) తరణులెంత నీనోటఁ దములము వెట్టినాను ధర నీనోరు నొచ్చీనా దక్కుఁగాక దొరకొనొకరొకరి తొడమీఁదఁ గూచుండినా గరిమ నలసీనా కాయగాచుఁ గాక (॥ఆయ॥) యెందరు కాఁగిట నిన్ను నెంగిలి సేసినాను యెందుకై నా నొగ్గక నీ వేవగించేవా ముందె శ్రీ వేంకటేశ ముంచి నన్ను నేలితివి అంది యింకా నన్నే కూడకారడిఁ బెట్టేవా English(||pallavi||) āya rāvayya lonigi nāragiṁtuvu kāyamĕṁta aṁṭinānu karam̐gī nāmanasu (||āya||) eḍanuṁḍi vachchi sadulĕṁdaru sĕnaginānu veḍugagām̐ḍavu nīvu vesarevā jāḍadoḍa madanaśhāstramu lĕnni sadivinā toḍane nīvīnula gŏṁdulu tanisīnā (||āya||) taraṇulĕṁta nīnoḍam̐ damulamu vĕṭṭinānu dhara nīnoru nŏchchīnā dakkum̐gāga dŏragŏnŏgarŏgari tŏḍamīm̐dam̐ gūsuṁḍinā garima nalasīnā kāyagāsum̐ gāga (||āya||) yĕṁdaru kām̐giḍa ninnu nĕṁgili sesinānu yĕṁdugai nā nŏggaga nī vevagiṁchevā muṁdĕ śhrī veṁkaḍeśha muṁchi nannu nelidivi aṁdi yiṁkā nanne kūḍagāraḍim̐ bĕṭṭevā