Title (Indic)ఆపెనేమి యడిగేవు అప్పటి నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపెనేమి యడిగేవు అప్పటి నీవు యేపున సిగ్గువడుటే యియ్యకొనుట (॥॥) అరసి చతురుడ నీవానతిచ్చిన మాటకు సరి నూర కుండితేనే సమ్మతించుట సరికి బేసికి నీవు జాణతనము లాడితే సరసము తానాడితే చనవు చెల్లించుట (॥॥) ఆరీతి ఘనుఁడవు నీ వాపెఁ దప్పక చూచితే సారెఁ దిరుగఁ జూచితే సమ్మతించుట కేరికేరి నీవట్టే కిలకిల నవ్వితేను తారుకాణగా నవ్వితేఁ దమకించుట (॥॥) యిన్నిటా శ్రీవేంకటేశ యిట్టే కాఁగిలించితివి చన్నుల నాపె వొత్తుటే సమ్మతించుట మన్నించి మోవి యిచ్చి మరుగఁగఁ జేసుకొంటే పన్ని తాను మోవిచ్చుట పతివిందు వెట్టుట English(||pallavi||) ābĕnemi yaḍigevu appaḍi nīvu yebuna sigguvaḍuḍe yiyyagŏnuḍa (||||) arasi saduruḍa nīvānadichchina māḍagu sari nūra kuṁḍidene sammadiṁchuḍa sarigi besigi nīvu jāṇadanamu lāḍide sarasamu tānāḍide sanavu sĕlliṁchuḍa (||||) ārīdi ghanum̐ḍavu nī vābĕm̐ dappaga sūside sārĕm̐ dirugam̐ jūside sammadiṁchuḍa kerigeri nīvaṭṭe kilagila navvidenu tārugāṇagā navvidem̐ damagiṁchuḍa (||||) yinniḍā śhrīveṁkaḍeśha yiṭṭe kām̐giliṁchidivi sannula nābĕ vŏttuḍe sammadiṁchuḍa manniṁchi movi yichchi marugam̐gam̐ jesugŏṁṭe panni tānu movichchuḍa padiviṁdu vĕṭṭuḍa