Title (Indic)ఆతడు బత్తిగలఁడు అన్నిటా నీపై నిదే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతడు బత్తిగలఁడు అన్నిటా నీపై నిదే నీతితోడ నుండవే నీకే మేలు (॥॥) వేసరుకొనకువే విభుఁడు దానే వచ్చీ ఆసపడి వుండవే అన్నియు లెస్సయ్యీనీ వాసిఁ బంతాలాడకువే వలపులు చవులయ్యీ బాసలు దలఁచుకోవే పట్టమేలేవు (॥॥) యెగ్గులు వట్టకువే యీతఁడే నిన్ను మన్నించీ సిగ్గులు వడకువే చింత దీరీని వెగ్గళపు జంకెలేలే వేడుక దానే పుట్టీ వొగ్గి కాచుకుండవే వుర మెక్కేవు (॥॥) సేవలింకాఁ జేయవే శ్రీవేంకటేశుఁడు గూడీ వావులు చెప్పితి వౌనే వన్నేలుగాను భావములోఁ గొంకకువే పచ్చి దేరీఁ దమకము దేవులవై మెరయవే దిష్టమయ్యీ భోగము English(||pallavi||) ādaḍu battigalam̐ḍu anniḍā nībai nide nīdidoḍa nuṁḍave nīge melu (||||) vesarugŏnaguve vibhum̐ḍu dāne vachchī āsabaḍi vuṁḍave anniyu lĕssayyīnī vāsim̐ baṁtālāḍaguve valabulu savulayyī bāsalu dalam̐sugove paṭṭamelevu (||||) yĕggulu vaṭṭaguve yīdam̐ḍe ninnu manniṁchī siggulu vaḍaguve siṁta dīrīni vĕggaḽabu jaṁkĕlele veḍuga dāne puṭṭī vŏggi kāsuguṁḍave vura mĕkkevu (||||) sevaliṁkām̐ jeyave śhrīveṁkaḍeśhum̐ḍu gūḍī vāvulu sĕppidi vaune vannelugānu bhāvamulom̐ gŏṁkaguve pachchi derīm̐ damagamu devulavai mĕrayave diṣhṭamayyī bhogamu