Title (Indic)మా పంతము లీడేరె మరి నీ కోరికె చెల్లె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా పంతము లీడేరె మరి నీ కోరికె చెల్లె చూపుల నాతనినంటి చూచుకోవమ్మా (॥॥) యింతి నీరమణుఁడు నీయెదుటనే వున్నాఁడు దొంతులుగాఁ జెలులను దూరకువమ్మ మంతన మిద్దరికి సమ్మతిగానే వొనగూడె చెంత నీవలసినట్టు సేయవమ్మా (॥॥) పొలసి నీకాతనికి పొందులెల్లాఁ జేసితిమి మెలుపున నీ చెలుల మెచ్చవమ్మ యెలమిఁ బానుపు మీఁద నిట్టే మీరపములాయ అలమి ఆడేమాటలాడవమ్మా (॥॥) శ్రీవేంకటేశ్వరుఁడిదె చెలరేఁగి నినుఁ గూడె మావంటి నీచెలులను మన్నించవమ్మ ఆవటించి మేడలో మీరాడినవే ఆటలాయ తావుల రతులనెల్లఁ దనియవమ్మా English(||pallavi||) mā paṁtamu līḍerĕ mari nī korigĕ sĕllĕ sūbula nādaninaṁṭi sūsugovammā (||||) yiṁti nīramaṇum̐ḍu nīyĕduḍane vunnām̐ḍu dŏṁtulugām̐ jĕlulanu dūraguvamma maṁtana middarigi sammadigāne vŏnagūḍĕ sĕṁta nīvalasinaṭṭu seyavammā (||||) pŏlasi nīgādanigi pŏṁdulĕllām̐ jesidimi mĕlubuna nī sĕlula mĕchchavamma yĕlamim̐ bānubu mīm̐da niṭṭe mīrabamulāya alami āḍemāḍalāḍavammā (||||) śhrīveṁkaḍeśhvarum̐ḍidĕ sĕlarem̐gi ninum̐ gūḍĕ māvaṁṭi nīsĕlulanu manniṁchavamma āvaḍiṁchi meḍalo mīrāḍinave āḍalāya tāvula radulanĕllam̐ daniyavammā