Title (Indic)ఆతని నీవేమైనా నంటివా తొల్లి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని నీవేమైనా నంటివా తొల్లి నీ తమి తానె యెరుఁగు నీకేలే వెరపు (॥అతని॥) మొగము చూచె నతఁడు మొక్కిలి వందుకు నీ తగ వాతఁ డెఱఁగడా దాని కేమి పగ యిద్దరికి లేదు సంతాన నుండితి వింతే నిగిడి యిందుకుఁ గామ నీ కేలే వెరవ (॥అతని॥) తామెర వేసె నతఁడు తట్టితివి చేత నీవు దోమటి దోడికేవేళ దోసమా యేమి యేమిటాను మోసపోరు యిద్దరికి కిద్దరే సాటి నేమ మేమిటాఁ దప్పదు నీ కేలే వెరవ (॥అతని॥) చేత నిన్ను నంటఁగాను సిరసు వంచితి వింతే ఆతఁడె శ్రీవెంకటేశుఁ డందు కేమి యేతులకుఁ గూడితిరి యిద్దరు నిక్కడనే నీతితో బదుక వమ్మ నీ కేల వెరవ English(||pallavi||) ādani nīvemainā naṁṭivā tŏlli nī tami tānĕ yĕrum̐gu nīgele vĕrabu (||adani||) mŏgamu sūsĕ nadam̐ḍu mŏkkili vaṁdugu nī taga vādam̐ ḍĕṟam̐gaḍā dāni kemi paga yiddarigi ledu saṁtāna nuṁḍidi viṁte nigiḍi yiṁdugum̐ gāma nī kele vĕrava (||adani||) tāmĕra vesĕ nadam̐ḍu taṭṭidivi seda nīvu domaḍi doḍigeveḽa dosamā yemi yemiḍānu mosaboru yiddarigi kiddare sāḍi nema memiḍām̐ dappadu nī kele vĕrava (||adani||) seda ninnu naṁṭam̐gānu sirasu vaṁchidi viṁte ādam̐ḍĕ śhrīvĕṁkaḍeśhum̐ ḍaṁdu kemi yedulagum̐ gūḍidiri yiddaru nikkaḍane nīdido baduga vamma nī kela vĕrava