Title (Indic)ఆఁటదానిపై నీ బలు వంతయునుఁ జూపేవా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదానిపై నీ బలు వంతయునుఁ జూపేవా నాఁటెనా నీ ఆయములు నవ్వుల నా మాటలు (॥ఆటదాని॥) వాలుకరెప్పలు వంచి వడిఁ దప్పక చూచేవు వొలి నిందాఁక నేడ నుంటి వంటేను తాలిమి లే కప్పటికి తగఁ గసరుకొనేవు యేలని నెంజిరి వికం నెంతటాఁ దీరదురా (॥ఆటదాని॥) చేరి మారుమోముతోఁ బిల్చిన నాతోఁ బలుకవు మేర మీరే నీ గుణాలు మెచ్చే నంటేను దార దప్ప కందుకె తగఁ బంతా లాడేవు యేరా నా పై కోప మెంత నీ కున్నదిరా (॥ఆటదాని॥) కోక గట్టుక నాతోను కోరివాదుకు వచ్చేవు కైకొని నీ పరువులు గంటి నంటేను యేక మై యిట్టె శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి యీడక నా గరిమెలు యెందు కైనా వచ్చురా English(||pallavi||) ām̐ṭadānibai nī balu vaṁtayunum̐ jūbevā nām̐ṭĕnā nī āyamulu navvula nā māḍalu (||āḍadāni||) vālugarĕppalu vaṁchi vaḍim̐ dappaga sūsevu vŏli niṁdām̐ka neḍa nuṁṭi vaṁṭenu tālimi le kappaḍigi tagam̐ gasarugŏnevu yelani nĕṁjiri vigaṁ nĕṁtaḍām̐ dīradurā (||āḍadāni||) seri mārumomudom̐ bilsina nādom̐ balugavu mera mīre nī guṇālu mĕchche naṁṭenu dāra dappa kaṁdugĕ tagam̐ baṁtā lāḍevu yerā nā pai koba mĕṁta nī kunnadirā (||āḍadāni||) koga gaṭṭuga nādonu korivādugu vachchevu kaigŏni nī paruvulu gaṁṭi naṁṭenu yega mai yiṭṭĕ śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi yīḍaga nā garimĕlu yĕṁdu kainā vachchurā