Title (Indic)ఈ కోపా లీతాపా లిట్టె వుండీనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఈ కోపా లీతాపా లిట్టె వుండీనా సాకిరి నేఁ దెలిపేఁగా సాదించేదానిని (॥ఈకోపా॥) ఆతఁ డీడకు రాఁగానె ఆన వెట్టుకొందు గాక కాతరానఁ జెప్పి పంపఁ గారణ మేమే యీతల నీ రమణుఁడు యెదుట నిలిచితేను చూతము వో యిట్లనె సొలసెటిదానిని (॥ఈకోపా॥) వోడక నిన్ను రమ్మంటే నొల్ల నందు వింతే కాక ఆడ నుండఁగానె లేక లంప నేఁటికే కూడనివారే తమిఁ గూడేరు యిప్పు డెట్టె తోడనె పంగించేఁ బో తొలఁగెటిదానిని (॥ఈకోపా॥) పెల్లున నీ వొద్దికె పిలిపించు కొందు గాక యిల్లురికి వచ్చి వాదు లివి యేఁటికే వొల్లనె శ్రీ వేంకటేశు డొద్దికతో నిన్నుఁ గూడె పల్లదాన నవ్వేఁ బో పాసియుండేదానిని English(||pallavi||) ī kobā līdābā liṭṭĕ vuṁḍīnā sāgiri nem̐ dĕlibem̐gā sādiṁchedānini (||īgobā||) ādam̐ ḍīḍagu rām̐gānĕ āna vĕṭṭugŏṁdu gāga kādarānam̐ jĕppi paṁpam̐ gāraṇa meme yīdala nī ramaṇum̐ḍu yĕduḍa nilisidenu sūdamu vo yiṭlanĕ sŏlasĕḍidānini (||īgobā||) voḍaga ninnu rammaṁṭe nŏlla naṁdu viṁte kāga āḍa nuṁḍam̐gānĕ lega laṁpa nem̐ṭige kūḍanivāre tamim̐ gūḍeru yippu ḍĕṭṭĕ toḍanĕ paṁgiṁchem̐ bo tŏlam̐gĕḍidānini (||īgobā||) pĕlluna nī vŏddigĕ pilibiṁchu kŏṁdu gāga yillurigi vachchi vādu livi yem̐ṭige vŏllanĕ śhrī veṁkaḍeśhu ḍŏddigado ninnum̐ gūḍĕ palladāna navvem̐ bo pāsiyuṁḍedānini