Title (Indic)తా నేల నిలుచున్నాఁడు తడవుల నుండీని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నేల నిలుచున్నాఁడు తడవుల నుండీని పానిపట్టి చెలులాల పద మనరే (॥తా నేల॥) మనసు రాని తలఁపు మాటలోనె కాన వచ్చు పెనఁగి యప్పటి వీఁడు పిలిచీఁ గొంతా ననుపు గల దెల్లాను నవ్వినందే తెలిసితి పని గద్దు వచ్చేఁ గాని పద మనరే (॥తానేల॥) నెరమెచ్చువలపులు నిలిచినందే తోచె సరసాన వీఁడె చేయి చాఁచీఁ గొంతా కరుణ గల దెల్లాను కనుచూపులనె కంటి పరిణామ మాయ నాకుఁ బద మనరే (॥తానేల॥) కలిగిన తమకము కాఁగిటిలోఁ గానవచ్చె అలరి తాఁ బెట్టుకొనీ ఆనలూఁ గొంతా వెల లేని వేడుక శ్రీవెంకటేశుఁ డిటు గూడె పలుకు లేఁటికి నిఁకఁ బద మనరే English(||pallavi||) tā nela nilusunnām̐ḍu taḍavula nuṁḍīni pānibaṭṭi sĕlulāla pada manare (||tā nela||) manasu rāni talam̐pu māḍalonĕ kāna vachchu pĕnam̐gi yappaḍi vīm̐ḍu pilisīm̐ gŏṁtā nanubu gala dĕllānu navvinaṁde tĕlisidi pani gaddu vachchem̐ gāni pada manare (||tānela||) nĕramĕchchuvalabulu nilisinaṁde tosĕ sarasāna vīm̐ḍĕ seyi sām̐sīm̐ gŏṁtā karuṇa gala dĕllānu kanusūbulanĕ kaṁṭi pariṇāma māya nāgum̐ bada manare (||tānela||) kaligina tamagamu kām̐giḍilom̐ gānavachchĕ alari tām̐ bĕṭṭugŏnī ānalūm̐ gŏṁtā vĕla leni veḍuga śhrīvĕṁkaḍeśhum̐ ḍiḍu gūḍĕ palugu lem̐ṭigi nim̐kam̐ bada manare