Title (Indic)వేసరి వున్నారు తొల్లె వెలఁదులిందరు నీతో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వేసరి వున్నారు తొల్లె వెలఁదులిందరు నీతో వీసమంత పనికైనా వీఁగింతురు సుమ్మీ (॥వేసరి॥) నీవు మోహించినసతి నిన్నేమనినాఁ జెల్లు ఆవటించి నీ వాపె నేమనినాఁ జెల్లు పూవుఁగాక పిందెఁగాక పోదిఁ బెట్టుకున్నవారి దీవెనమాటలాడినాఁ దిట్టుదురు సుమ్మీ (॥వేసరి॥) చనవుగలుగుయింతి జంకించ నిన్నుఁదగు చెనకి నీవాపె నేమిసేసినాఁ దగు ననిచియు ననచక నవ్వుకె లోనైనవారిఁ దనువులు నిమిరినాఁ దట్టింతురు సుమ్మీ (॥వేసరి॥) పట్టపు అలమేల్మంగ పై కొంటివి నీమెచ్చు గుట్టు శ్రీవెంకటేశ నీకూటమి మెచ్చు ఱట్టుగా నాపెచేత నాఱడిఁబడ్డయట్టివారిఁ బట్టి బలిమిఁ గూడితి పంగింతురు సుమ్మీ English(||pallavi||) vesari vunnāru tŏllĕ vĕlam̐duliṁdaru nīdo vīsamaṁta panigainā vīm̐giṁturu summī (||vesari||) nīvu mohiṁchinasadi ninnemaninām̐ jĕllu āvaḍiṁchi nī vābĕ nemaninām̐ jĕllu pūvum̐gāga piṁdĕm̐gāga podim̐ bĕṭṭugunnavāri dīvĕnamāḍalāḍinām̐ diṭṭuduru summī (||vesari||) sanavugaluguyiṁti jaṁkiṁcha ninnum̐dagu sĕnagi nīvābĕ nemisesinām̐ dagu nanisiyu nanasaga navvugĕ lonainavārim̐ danuvulu nimirinām̐ daṭṭiṁturu summī (||vesari||) paṭṭabu alamelmaṁga pai kŏṁṭivi nīmĕchchu guṭṭu śhrīvĕṁkaḍeśha nīgūḍami mĕchchu ṟaṭṭugā nābĕseda nāṟaḍim̐baḍḍayaṭṭivārim̐ baṭṭi balimim̐ gūḍidi paṁgiṁturu summī