Title (Indic)ఇంతట నిట్టె విచ్చేసి యింతిఁ గూడితేఁ గనక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతట నిట్టె విచ్చేసి యింతిఁ గూడితేఁ గనక వంతుకు నిన్ను జాణదేవర వనవచ్చును (॥ఇంత॥) తనలోనె తలపోసి తప్పక చూచేవేళ వనితను దేవగన్య యనవచ్చును పనివి నిన్నుఁ దలఁచి పాటలు వాడేవేళ అనుగు గంధర్వకాంత యనవచ్చును (॥ఇంత॥) చలపట్టి విరహాన జలకేళి సేయువేళ అలివేణి నాగకన్య యనవచ్చును చలువకుఁ జంద్రకాంత శిలపైఁ బొరలువేళ అలరిన చంద్రకన్య యనవచ్చును (॥ఇంత॥) శ్రీ వెంకటేశ నీవు చెలియఁ గూడినవేళ ఆవటించి నిజలక్ష్మీ యనవచ్చును వోవల నీ సోమ్ములలో వురమున మోచువేళ దేవి యలమేలుమంగ దిష్ట మనవచ్చును English(||pallavi||) iṁtaḍa niṭṭĕ vichchesi yiṁtim̐ gūḍidem̐ ganaga vaṁtugu ninnu jāṇadevara vanavachchunu (||iṁta||) tanalonĕ talabosi tappaga sūseveḽa vanidanu devaganya yanavachchunu panivi ninnum̐ dalam̐si pāḍalu vāḍeveḽa anugu gaṁdharvagāṁta yanavachchunu (||iṁta||) salabaṭṭi virahāna jalageḽi seyuveḽa aliveṇi nāgaganya yanavachchunu saluvagum̐ jaṁdragāṁta śhilabaim̐ bŏraluveḽa alarina saṁdraganya yanavachchunu (||iṁta||) śhrī vĕṁkaḍeśha nīvu sĕliyam̐ gūḍinaveḽa āvaḍiṁchi nijalakṣhmī yanavachchunu vovala nī sommulalo vuramuna mosuveḽa devi yalamelumaṁga diṣhṭa manavachchunu