Title (Indic)ఆయ నాయఁ బోయఁ బోయ నల్లనాఁడె నీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయ నాయఁ బోయఁ బోయ నల్లనాఁడె నీ చాయల సన్నల పొందు చాలువయ్యా (॥ఆయ॥) వెన్నెలలు వేఁడెనుచు విసరించుకొనె నాపై కన్నుల నవ్వులు చల్లి కాఁక రేఁచేవు పన్ని వురిసిన యందుపై నుడుకు చల్లినట్లు యెన్న మాతో మేకు సేసేవిఁక నేలయ్యా (॥ఆయ॥) పాయము వేఁగని యిట్టె బడలివుండె నాపై నీ యడ మాట మూట లేల యేత్తేవు చాయల వేయిటి మీఁద జవ్వాది కొమ్ము రీతి ఆయములు సోకించే వవునయ్యా (॥ఆయ॥) సరసాలు వాఁడెనుచు సారెకు మొక్కె ననుచు మురిపెము గోరేల మోపే వయ్యా గరిమ శ్రీ వెంకటేశ కరుణించి మెచ్చినట్టు కరఁగి కూడితి నన్నుఁ గత లేలయ్యా English(||pallavi||) āya nāyam̐ boyam̐ boya nallanām̐ḍĕ nī sāyala sannala pŏṁdu sāluvayyā (||āya||) vĕnnĕlalu vem̐ḍĕnusu visariṁchugŏnĕ nābai kannula navvulu salli kām̐ka rem̐sevu panni vurisina yaṁdubai nuḍugu sallinaṭlu yĕnna mādo megu sesevim̐ka nelayyā (||āya||) pāyamu vem̐gani yiṭṭĕ baḍalivuṁḍĕ nābai nī yaḍa māḍa mūḍa lela yettevu sāyala veyiḍi mīm̐da javvādi kŏmmu rīdi āyamulu sogiṁche vavunayyā (||āya||) sarasālu vām̐ḍĕnusu sārĕgu mŏkkĕ nanusu muribĕmu gorela mobe vayyā garima śhrī vĕṁkaḍeśha karuṇiṁchi mĕchchinaṭṭu karam̐gi kūḍidi nannum̐ gada lelayyā