Title (Indic)ఆడుకోకు నీకు నీవే అంతేసి పంతాలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడుకోకు నీకు నీవే అంతేసి పంతాలు జాడతోడ మరినవె చాలునయ్య యిఁకను (॥ఆడు॥) నిగమములై తేను నిలువఁ బెట్టేవాడవు మగువలతోఁ గల్ల మాటలాడేవా అగడై అసురకాంతలందుకు సాకిరున్నారు జగతి సత్యము లవె చాలునయ్యా యిఁకను (॥ఆడు॥) పెరిమ యజ్ఞభాగాలు పెద్దవై ఆరగించేవు అరిది వెన్నలు ముచ్చి లారగించేవా యిరవై గొల్లెతలెల్లా నిందుకు సాకిరున్నారు సరి నట్టి విశ్వాసాలె చాలునయ్య యిఁకను (॥ఆడు॥) జమళి నవ్వుతా నాకు చాఁచె హస్తాలు నీవి కొమరెలనంటి యెత్తుకొని వచ్చేవా సమరతి రుకుమిణి సాకిరి శ్రీవెంకటేశ సముకమైతిమి బొంకుచాలునయ్య యిఁకను English(||pallavi||) āḍugogu nīgu nīve aṁtesi paṁtālu jāḍadoḍa marinavĕ sālunayya yim̐kanu (||āḍu||) nigamamulai tenu niluvam̐ bĕṭṭevāḍavu maguvaladom̐ galla māḍalāḍevā agaḍai asuragāṁtalaṁdugu sāgirunnāru jagadi satyamu lavĕ sālunayyā yim̐kanu (||āḍu||) pĕrima yajñabhāgālu pĕddavai āragiṁchevu aridi vĕnnalu muchchi lāragiṁchevā yiravai gŏllĕdalĕllā niṁdugu sāgirunnāru sari naṭṭi viśhvāsālĕ sālunayya yim̐kanu (||āḍu||) jamaḽi navvudā nāgu sām̐sĕ hastālu nīvi kŏmarĕlanaṁṭi yĕttugŏni vachchevā samaradi rugumiṇi sāgiri śhrīvĕṁkaḍeśha samugamaidimi bŏṁkusālunayya yim̐kanu