Title (Indic)ఆయమంటి మోవితీపు లానఁగ రాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయమంటి మోవితీపు లానఁగ రాదా వో యమ్మ వద్దనున్నాఁడు వూరకుండ నేఁటికే (॥ఆయ॥) చెక్కు నొక్కఁ బొద్దులేదో సేదదేరఁ బొద్దులేదొ గుక్కక పతిఁ గాఁగిటఁ గూడఁగ రాదా వెక్కసపు విరహాన విసిగితివిందాఁక యిక్కడికే పతి వచ్చె నిఁకనేలే కొసరు (॥ఆయ॥) నవ్వు నవ్వ వేళలేదొ నమ్మికకు వేళలేదో పువ్వువలెఁ గాఁగిటను పొదుగరాదా దవ్వుల నున్నాఁడంటా తమకించితివిందాఁక యివ్వల నీ గుబ్బలంటె నిఁక జాగువలెనా (॥ఆయ॥) మాటాడఁ దతిలేదొ మనసియ్యఁ దతిలేదొ గాఁటముగ దెరవేసి కలయరాదా యేఁట వెట్టి శ్రీ వెంకటేశుఁడిదె నిన్నుఁగూడె యీటుగానే మన్నించె నిఁక నెదురేదే English(||pallavi||) āyamaṁṭi movidību lānam̐ga rādā vo yamma vaddanunnām̐ḍu vūraguṁḍa nem̐ṭige (||āya||) sĕkku nŏkkam̐ bŏdduledo sedaderam̐ bŏdduledŏ gukkaga padim̐ gām̐giḍam̐ gūḍam̐ga rādā vĕkkasabu virahāna visigidiviṁdām̐ka yikkaḍige padi vachchĕ nim̐kanele kŏsaru (||āya||) navvu navva veḽaledŏ nammigagu veḽaledo puvvuvalĕm̐ gām̐giḍanu pŏdugarādā davvula nunnām̐ḍaṁṭā tamagiṁchidiviṁdām̐ka yivvala nī gubbalaṁṭĕ nim̐ka jāguvalĕnā (||āya||) māḍāḍam̐ dadiledŏ manasiyyam̐ dadiledŏ gām̐ṭamuga dĕravesi kalayarādā yem̐ṭa vĕṭṭi śhrī vĕṁkaḍeśhum̐ḍidĕ ninnum̐gūḍĕ yīḍugāne manniṁchĕ nim̐ka nĕdurede