Title (Indic)ఆఁడుజాతెల్లా నొక్కటే అందరికి నొక్క చాలే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁడుజాతెల్లా నొక్కటే అందరికి నొక్క చాలే వాఁడి తన గోరే అయితే వద్దనేవారెవ్వరు (॥ఆఁడు॥) సిగ్గువడ్డ నిన్నుఁ జూచి చిత్తమెల్లా నీరాయ అగ్గలమై నిన్ను నాడే యాపె మాటకు కగ్గుదేర నీవు మున్ను కట్టుకొన్న బయిరూపము వొగ్గి ఆడక పోవునా వోరుచుకో యిఁకను (॥ఆఁడు॥) తలవంచే నిన్నుఁ జూచి దైలువారె నాచెమట చెలరేఁగి ఆపె నిన్నుఁ జేసేచేఁతకు యెలమి నీవేడుకకు యెత్తుకొన్న యెత్తుకోలు తెలిసిన వాఁడవిఁక దించవచ్చునా (॥ఆఁడు॥) తేలగిలే నిన్నుఁ జూచి తెలివొందె నామొగము కోలుముందై ఆపె నిన్నుఁ గూడఁగాను యీలీల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి వేళకు వచ్చిన మేలు విడువఁగ వచ్చునా English(||pallavi||) ām̐ḍujādĕllā nŏkkaḍe aṁdarigi nŏkka sāle vām̐ḍi tana gore ayide vaddanevārĕvvaru (||ām̐ḍu||) sigguvaḍḍa ninnum̐ jūsi sittamĕllā nīrāya aggalamai ninnu nāḍe yābĕ māḍagu kaggudera nīvu munnu kaṭṭugŏnna bayirūbamu vŏggi āḍaga povunā vorusugo yim̐kanu (||ām̐ḍu||) talavaṁche ninnum̐ jūsi dailuvārĕ nāsĕmaḍa sĕlarem̐gi ābĕ ninnum̐ jesesem̐tagu yĕlami nīveḍugagu yĕttugŏnna yĕttugolu tĕlisina vām̐ḍavim̐ka diṁchavachchunā (||ām̐ḍu||) telagile ninnum̐ jūsi tĕlivŏṁdĕ nāmŏgamu kolumuṁdai ābĕ ninnum̐ gūḍam̐gānu yīlīla śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi veḽagu vachchina melu viḍuvam̐ga vachchunā