Title (Indic)ఆరంగఁ జూడరే అదె కృష్ణమహిమలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆరంగఁ జూడరే అదె కృష్ణమహిమలు కూరిమి మించిన గోపికలు (॥అరం॥) కొట్టేటివుట్లు కోలలగుంపులు గుట్టులఁ బొంచెడి గోపాలులు అట్టులుఁ బండ్లు నట్టె చక్కిలాలు చుట్టుల నెక్కడ చూచినను (॥అరం॥) యేఁగేటి వీధులు యిండ్లిండ్ల వాకిళ్ల వాఁగే పంచమహావాద్యములు దాఁగిలి ముచ్చిమిఁ ద్రావేటి పాలును చేఁగదేరీనెందు చేయిచాఁచినా (॥అరం॥) కారేటి జున్నులు గడ్డపెరుగులు వారలువట్టేటి వైపులును యీరీతి శ్రీవేంకటేశుని సన్నిది ఆరితేరె నెంద నరసినను English(||pallavi||) āraṁgam̐ jūḍare adĕ kṛṣhṇamahimalu kūrimi miṁchina gobigalu (||araṁ||) kŏṭṭeḍivuṭlu kolalaguṁpulu guṭṭulam̐ bŏṁchĕḍi gobālulu aṭṭulum̐ baṁḍlu naṭṭĕ sakkilālu suṭṭula nĕkkaḍa sūsinanu (||araṁ||) yem̐geḍi vīdhulu yiṁḍliṁḍla vāgiḽla vām̐ge paṁchamahāvādyamulu dām̐gili muchchimim̐ drāveḍi pālunu sem̐gaderīnĕṁdu seyisām̐sinā (||araṁ||) kāreḍi junnulu gaḍḍabĕrugulu vāraluvaṭṭeḍi vaibulunu yīrīdi śhrīveṁkaḍeśhuni sannidi āriderĕ nĕṁda narasinanu