Title (Indic)దానికేమి దోసమా తగిన గేస్తురాలవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దానికేమి దోసమా తగిన గేస్తురాలవు నేను నిన్ను నేమనేను నీకేలే సిగ్గులు (॥దీని॥) కొండవంటి దొర నిన్ను కొంగువట్టి తీసితేను వొండేమీననలేక వొద్దికైతివే అండనుండి సారెసారె నాతఁడే పిలువఁగాను బండుబండు గాలేక పలికితివే (॥దీని॥) చక్కని జాణఁడు నీ జవ్వనము దడవఁగ గక్కన విడువలేక కైకొంటివే వెక్కసానఁ గమ్మటిని వీడె మాతఁడియ్యఁగాను అక్కరఁ దోయలేక అందుకొంటివే (॥దీని॥) శ్రీవెంకటేశ్వరుఁడు చెక్కు నిన్ను నొక్కఁగాను కైవశమై అంతలోనఁ గరఁగితివే యీవేళ నన్నేలి వచ్చె నిద్దరి సవతులఁగా కావించి నవ్వితి నిట్టే కదిసితివే English(||pallavi||) dānigemi dosamā tagina gesturālavu nenu ninnu nemanenu nīgele siggulu (||dīni||) kŏṁḍavaṁṭi dŏra ninnu kŏṁguvaṭṭi tīsidenu vŏṁḍemīnanalega vŏddigaidive aṁḍanuṁḍi sārĕsārĕ nādam̐ḍe piluvam̐gānu baṁḍubaṁḍu gālega paligidive (||dīni||) sakkani jāṇam̐ḍu nī javvanamu daḍavam̐ga gakkana viḍuvalega kaigŏṁṭive vĕkkasānam̐ gammaḍini vīḍĕ mādam̐ḍiyyam̐gānu akkaram̐ doyalega aṁdugŏṁṭive (||dīni||) śhrīvĕṁkaḍeśhvarum̐ḍu sĕkku ninnu nŏkkam̐gānu kaivaśhamai aṁtalonam̐ garam̐gidive yīveḽa nanneli vachchĕ niddari savadulam̐gā kāviṁchi navvidi niṭṭe kadisidive