Title (Indic)ఆనతియ్యవయ్యా నీ యప్పణ గావలె నాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతియ్యవయ్యా నీ యప్పణ గావలె నాకు కానుకింద నిమ్మపండు కందువయే దిఁకను (॥ఆన॥) చనవుగలాపె నీసంగడిఁ గూచున్నది మనవిగలాపె నీతో మాట చెప్పని ననుపుగలాపె సారె నవ్వులు నవ్వీనిడె వొసర నేఁజేసేటి వూడిగమేదిఁకను (॥ఆన॥) పంతము గలాపె నీతో పలుమారు బింకమాడీ చింత గలిగగినయాపె చేయి చాఁచీని వంతు గలిగినయాపె వరుసకు వచ్చున్నది బంతినున్నదాన నాకుఁ బనియేదిఁకను (॥ఆన॥) వాసిగల్గినయాపె వన్నెతో మొగము చూచీ ఆసగలిగినయాపె ఆయాలంటీని యీసరినే శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి నేస చల్లితివి నాకు సేవ యేఁటిదిఁకను English(||pallavi||) ānadiyyavayyā nī yappaṇa gāvalĕ nāgu kānugiṁda nimmabaṁḍu kaṁduvaye dim̐kanu (||āna||) sanavugalābĕ nīsaṁgaḍim̐ gūsunnadi manavigalābĕ nīdo māḍa sĕppani nanubugalābĕ sārĕ navvulu navvīniḍĕ vŏsara nem̐jeseḍi vūḍigamedim̐kanu (||āna||) paṁtamu galābĕ nīdo palumāru biṁkamāḍī siṁta galigaginayābĕ seyi sām̐sīni vaṁtu galiginayābĕ varusagu vachchunnadi baṁtinunnadāna nāgum̐ baniyedim̐kanu (||āna||) vāsigalginayābĕ vannĕdo mŏgamu sūsī āsagaliginayābĕ āyālaṁṭīni yīsarine śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi nesa sallidivi nāgu seva yem̐ṭidim̐kanu