Title (Indic)ఇద్దరూ నిద్దరే మోహమేమి చెప్పేది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరూ నిద్దరే మోహమేమి చెప్పేది అద్దుకొని యిదివో పెండ్లాడినది మొదలు (॥ఇద్ద॥) ఒండొరులఁ జూచి యాసనొగి రెప్పలు వేయరు యెండలేక చెమరించిరిద్దరు నట్టే దిండుకొని పానుపుపై తెల్లవారుటెరుఁగరు నిండుకున్నారు రతుల నేరుపులఁ దాము (॥ఇద్ద॥) పచ్చిమోవితేనెలాని పలుమారుఁ దనియరు లచ్చనై వొకమాఁటే పులకలురేఁగె హెచ్చుగా నాకు మడిచి యిచ్చే చెలులఁ జూడరు పెచ్చువెరిగేరు తమ ప్రియములఁ దాము (॥ఇద్ద॥) తమ మేనులపై గోరితాఁకులౌత చూచుకోరు జమళి నలపులకు జడియరు అమర శ్రీ వెంకటేశుఁడలమేలుమంగాఁ గూడి తమకించేరు లోలోతలఁపులఁ దాము English(||pallavi||) iddarū niddare mohamemi sĕppedi addugŏni yidivo pĕṁḍlāḍinadi mŏdalu (||idda||) ŏṁḍŏrulam̐ jūsi yāsanŏgi rĕppalu veyaru yĕṁḍalega sĕmariṁchiriddaru naṭṭe diṁḍugŏni pānububai tĕllavāruḍĕrum̐garu niṁḍugunnāru radula nerubulam̐ dāmu (||idda||) pachchimovidenĕlāni palumārum̐ daniyaru lachchanai vŏgamām̐ṭe pulagalurem̐gĕ hĕchchugā nāgu maḍisi yichche sĕlulam̐ jūḍaru pĕchchuvĕrigeru tama priyamulam̐ dāmu (||idda||) tama menulabai goridām̐kulauda sūsugoru jamaḽi nalabulagu jaḍiyaru amara śhrī vĕṁkaḍeśhum̐ḍalamelumaṁgām̐ gūḍi tamagiṁcheru lolodalam̐pulam̐ dāmu